చెవులు గిల్లుమంటున్నాయ్..!
రోడ్లపై హద్దు మీరుతున్న యువత ఆగడాలు
ఒక్కో బండిపై ముగ్గురేసి రైడింగ్
పది, ఇంటర్ విద్యార్థులే అధికం
అర్ధరాత్రిళ్ళు సైతం స్టంట్ లు వేస్తున్న మైనర్లు
మద్యం, గంజాయి మత్తులో తూలుతున్న భావితరం
తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం
పట్టించుకోని అధికారులు
నాగర్ కర్నూల్ మార్చి 20 (విజయక్రాంతి): నేటి బాలలే రేపటి పౌరులు అని నాణుడి. కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియో గం యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మంచి కంటే చెడు పైనే ఎక్కువగా ఆకర్షితులై విలాసాలు, వ్యసనాలకు బానిసలుగా మారి పెడదోవ పడుతున్నారు. కేవలం 9వ తరగతి నుంచి డిగ్రీ స్థాయి మధ్యలోని విద్యార్థులే అత్యంత ఆందోళన పరిస్థితుల్లో ప్రభావితులవుతున్నారని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావంతో ఆన్లైన్ క్లాస్ అవసరాల కోసం ఏర్పాటు చేసుకునే స్మార్ట్ ఫోన్లు, ఇంటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకునే ద్విచక్ర వాహనాలను చెడు వాటికే వినియోగిస్తున్న పరిస్థితి. ఫలితంగా తెలిసీ తెలియని వయసులో ప్రమాదకర స్థాయిలో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతూ కు టుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు.
ఇతరులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా ప్రధాన రహదారులు గల్లీ రోడ్ల వెంట ఇద్దరు ముగ్గురు ఒక్కో వాహనంపై నలుగురు యువకులు ప్రయాణిస్తూ ప్రమాదకర స్థాయిలో స్టంట్ లు కూడా చేస్తుం డడంతో స్థానికులు సామాన్యులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. మద్యం, సిగరెట్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు కూడా బానిసలుగా మారినట్లు తాజా ఘటనలు గుర్తుచేస్తున్నాయి. తరగతి గదిలో పా ఠ్యాంశాలను నేర్చుకోవాల్సిన విద్యార్థులు తోటి విద్యార్థులను వేధింపులకు గురిచేస్తూ స్మార్ట్ ఫోన్ ద్విచక్ర వాహనాలతో ఆకర్శించి వారిని బుట్టలో వేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.
అత్యంత శబ్దా లు వెలువడే ద్విచక్ర వాహనాలను సైతం నడుపుతూ చెవులు గిల్లు మనేలా శబ్దాలతో ఇతరులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయినా సంబంధిత ట్రాఫిక్ పోలీసులు ఇతర అధికారులు పట్టించుకోకపోవడంతో వీరి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయన్న వాదన వినపడుతోంది. ఆయా హాస్టల్స్, పాఠశాల, కళాశాలలో చదువుతున్న క్రమంలోనూ తరగతులకు డుమ్మా కొట్టి గల్లీల వెంట తిరుగుతున్నప్పటికీ సం బంధిత పాఠశాల, కళాశాల అధ్యాపక బృం దం అంటి ముట్టనట్లు వ్యవహరించడం వీరికి అలుసుగా మారిందని చెబుతున్నారు.
మద్యం, గంజాయి మత్తులో యువత.!
తల్లిదండ్రులు అహోరాత్రులు శ్రమిస్తూ తమ బిడ్డలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పిల్లలు కోరింది తెచ్చిపెడుతున్న క్రమంలోనూ వాటిని మరచి చిన్న వయసులోనే విలాసాలు, జల్సాలక, మత్తు పదార్థా లకు బానిసలుగా మారుతున్నారు. సుమా రు 9వ తరగతి నుండే సిగరెట్ వినియోగం, మద్యం మత్తులో తూలుతూ బయటపడుతున్నారు. ఆ మద్యం దుకాణాలు, కిరాణా దుకాణాల్లోనూ మైనర్ విద్యార్థులకు సిగరెట్లు మద్యం విక్రయిస్తుండడంతో వారికి ఇది సులువుగా మారింది.
మరి కొంతమంది యువత హైదరాబాద్ ప్రాంతంలోని దూల్పేట, బీదర్ ప్రాంతం నుంచి గంజాయి సరఫరా చేస్తున్న ముఠాతో సంబంధాలు పెట్టు కుని వారి నుంచి గంజాయి సేకరిస్తున్నట్లు కూడా పలు ఘటనలో వెలుగు చూస్తున్నా యి. అయినా ఆయా పాఠశాల, కళాశాల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రుల సైతం విద్యార్థుల వ్యవహార శైలి పట్ల శ్రద్ధ చూపకపోవడంతో మరింత పెచ్చు మీరుతున్నారని చర్చ జరుగుతోంది. గత రెండేళ్ల కాలంలో నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా గంజాయి పట్టుబడిన కేసుల్లో అత్యధిక తక్కువ వయ సు విద్యార్థులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మైనర్ ఇంటర్ విద్యార్థి మరి కొంతమంది విద్యార్థినీలతో ప్రేమాయ ణం, ఆభార్షన్ వ్యవహారం కూడా తీవ్ర చర్చ కు దారి తీసింది.
మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని పదేపదే పోలీస్ అధికారులు హెచ్చరి స్తున్నా వారి తల్లిదండ్రుల సైతం పట్టించుకోకపోవడంతో ఈ వ్యవహారం చేయి దాటి పోతోందని ఇది ఇలాగే కొనసాగితే భావి భారత పౌరులు రేపటి తరానికి ప్రశ్నార్థకం గా మిగులుతారా అన్న ఆందోళన వ్యక్తం అ వుతుంది. ఇప్పటికైనా ఆయా పాఠశాల కళాశాల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రుల చే పోలీస్ అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను విరివిగా ఏర్పాటు చేస్తూ గంజాయి మత్తు పదార్థాలు సిగరెట్ వాడక నియంత్రణ పటిష్టం చేయాలని వాదన వినిపిస్తోంది.




