దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
సికింద్రాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్పోరట్స్ కాంప్లెక్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగా నిపుణుల మార్గదర్శకత్వంలో వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన సాధనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్య ప్రకాష్ మాట్లాడుతూ, యోగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందించే గొప్ప భారతీయ సంప్రదాయమని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన, ఒత్తిడి రహిత జీవనశైలిని అలవర్చుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, ఉద్యోగులు, రైల్వే రక్షక దళం సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లు పాల్గొన్నారు.






