8 May, 2026 | 1:04 AM

ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు

08-05-2026 12:00 AM

రాజాపూర్ మే 7 : నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరు కోసం గురువారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు మండల ప్రత్యేక అధికారి  రాధా రోహిణి మండల ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు. నిరుద్యోగులకు టూవీలర్ త్రీ వీలర్ వానాల రుణాల మంజూరు కోసం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 72 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

దరఖాస్తుదారులందరికి ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులైన వారికి ఎలక్ట్రికల్ వాహనాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోఎంపీ ఓ వెంకట్ రాములు, సర్పంచ్ రామకృష్ణ, సూపర్డెంట్ వంశీకృష్ణ, ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ బాలానగర్, టి జి బి గ్రామీణ బ్యాంక్ ఫీల్ ఆఫీసర్, ఎస్సీ కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.