సమయపాలన పాటించాలి
కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి, మే 7 : ఉద్యోగులు సమయపాలన పాటించాలని, సమస్య నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం బెల్లంపల్లి మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి భూభారతి రెవెన్యూ దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులతో సరిచూసి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యాలయ అధికారులు, సిబ్బంది నిబద్ధతగా విధులు నిర్వహించాలన్నారు.
కలెక్టర్, డీసీపీలను మర్యాదపూర్వకంగా కలిసిన ఐటీడీఏ పీఓ
మంచిర్యాల, మే 7 (విజయక్రాంతి) : ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి(పీఓ)గా బాధ్యతలు స్వీకరించిన మంద మకరందు గురు వారం మంచిర్యాల కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం మంచిర్యాల పట్టణంలోని డిసిపి కార్యాలయంలో డిసిపి ఎగ్గడి భాస్కర్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.






