17-12-2025 10:53:02 AM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సిద్దాపూర్ గ్రామ సర్పంచ్ ,ఉప సర్పంచ్ లను తోటమాలి సంఘం మండల అధ్యక్షుడు ఆదే అశోక్ ఆధ్వర్యంలో కులస్తులు సాలువతో ఘనంగా సత్కరించారు. సర్పంచ్ చండే పద్మ శంకర్, ఉప సర్పంచ్ కృష్ణను సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తోటమాలి కుల సంఘం నుండి సర్పంచ్ ఉప సర్పంచ్ గా గెలవడం శుభదాయకమని మాలి కులస్తులందరూ ఐక్యంగా ఉండి కుల సంఘం ఐక్యతకు కట్టుబడి ఉండాలని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని సమస్యలను పరిష్కరిస్తానని సర్పంచ్ పద్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన తొట మాలికలస్తులు పాల్గొన్నారు