calender_icon.png 5 December, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిఖనిలో బొగ్గు ఉత్పత్తి పునరుద్ధరణకు ఐఎన్టీయూసీ కృషి

05-12-2025 05:40:54 PM

ఐఎన్టీయూసీ నేత కాంపల్లి సమ్మయ్య

బెల్లంపల్లి,(విజయక్రాంతి): శాంతిఖని బొగ్గుగనిలో ఉత్పత్తి పునరుద్ధరణ అయ్యేలా ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ కృషి చేస్తారని  ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపల్లి సమ్మయ్య, కేంద్రకమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీరం శెట్టి నరేందర్ అన్నారు. శుక్రవారం శాంతిఖనిలో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో శాంతిఖని గనిలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించే బాధ్యతను తాము తీసుకుంటామని అన్నారు.

శాంతిఖని గనిలో ప్రస్తుత పరిస్థితికి స్థానిక యజమాన్య నిర్లక్ష్య వైఖరి, అసమర్ధతే కారణమని విమర్శించారు.శాంతిఖని కార్మికులకు అండగా ఐఎన్టీయూసీ జెండా ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందనీ అభయమిచ్చారు.గత 30 రోజులుగా శాంతి ఖని గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. జేఏఎంఎస్ సంస్థకు అప్పజెప్పిన కాంట్రాక్టు పనులు పూర్తవుతున్న సమాచారం ముందుగానే తెలిసినప్పటికీ, ఎందుకు తగు చర్యలు తీసుకోలేదో స్థానిక యజమాన్యం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సంవత్సరాల తరబడి ఈ గనిలో పాతుకుపోయిన కొంతమంది అధికారులు తమ అనుచరులను కాపాడుకోవడానికి, వారికి లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నాలు చేయడం తప్ప, గని పూర్వవైభవం కొరకు గనిని కాపాడుకోవడానికి వారు చేపట్టిన చర్యలు శూన్యమని దుయ్యబట్టారు.

అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా 430 మంది కార్మికుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే పరిస్థితి నెలకొన్నదన్నారు. కనీసం బెల్టు క్లీనింగ్ కూడా చేయలేని దుస్థితిలో స్థానిక యజమాన్యం ఉండడం బాధాకరమన్నారు. ఎక్కడి పంపులు అక్కడే ఆగిపోవడం పంపులను రిపేరు చేయించడంలో ఆలసత్వం వహించారన్నారు. ఉత్పత్తి జరగడంలేదని సాకుతో కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తే ఐఎన్టియుసి చూస్తూ ఊరుకోమన్నారు. టైమింగ్ విషయంలో ఒత్తిడి తీసుకురావడం అధిక పనివారాన్ని పెంచడం, అండర్ గ్రౌండ్ లో తాగునీటి సదుపాయం కల్పనలేదన్నారు.

ఇబ్బందులకు గురి చేయడం పంప్ ఆపరేటర్లకు రన్నింగ్ చార్జి బ్యాక్ షిప్లలో రన్నింగ్ చార్జ్ రెస్టులను  ఇవ్వడంలేదన్నారు. కార్మికులను అవుట్ మస్టర్ విషయంలో ఇబ్బందులు పెట్టడం షిఫ్ట్ చేంజులను చెప్పకుండా చేయడం వంటి విధానాలను వెంటనే మానుకోవాలనికోరారు.ఈ సమావేశంలో ఏరియా  కార్యదర్శి కె ఓదేలు, కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి డి.శంకరరావు, గని కార్యదర్శి దేవ రమేష్, అసిస్టెంట్ కార్యదర్శి అనిల్, నాయకులు సదానందం, పలకపాటి శ్రీనివాస్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.