05-12-2025 06:06:21 PM
చండూరు డిప్యూటీ తహసిల్దార్ చంద్రశేఖర్
మునుగోడు/చండూర్,(విజయక్రాంతి): రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన అవినీతి తిమింగలం చండూర్ డిప్యూటీ తాసిల్దార్ చంద్రశేఖర్. వివరాల్లోకి వెళితే గట్టుప్పల మండలం తెరటుపల్లి గ్రామానికి చెందిన అక్రమ రిజిస్ట్రేషన్ పై సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదుధారుని మరణించిన నాన్నకి చెందిన భూమికి సంబంధించి గతంలో జారీ చేసిన మ్యుటేషన్ ప్రొసీడింగ్స్, సంబంధిత పత్రాలను ఫిర్యాదుధారునికి అప్పగించడానికి డిమాండ్ చేశారు. ఫిర్యాదు దారుడు ఏసీబీని ఆశ్రయించిన సదరు బాధితులు హైదరాబాద్ బాలాపూర్ లోని తన నివాసంలో ఏసీబీకి పట్టుబడి 20,000/-లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు దొరికిపోయాడు.ఈయన గతంలో మర్రిగూడ మండలంలో కూడ డిటిగా పనిచేశారు.అక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఉన్నట్టుగా సమాచారం.