18-10-2025 07:29:23 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఈనెల 24న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని-చింతల పోచమ్మ ప్రతిష్టాపన కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, సీతక్క, వాకిటి శ్రీహరిలకు ఆహ్వాన పత్రికను ఎల్లారెడ్డి గౌడ సంఘం, అధ్యక్షులు, ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘం ఉపాధ్యక్షులు మతమాల ప్రశాంత్ గౌడ్ సంఘం సభ్యులు కులస్తులు, ఆహ్వాన పత్రికను మర్యాదపూర్వకంగా అందజేశారు.
శనివారం హైదరాబాదులోని పొన్నం ప్రభాకర్ నివాసంలో కలిసి మంత్రులకు ఆలయ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 24 నుండి 28 వరకు నిర్వహించే విగ్రహ ప్రతిష్టాపనతో పాటు బ్రాహ్మణ పురోహితులతో పూజా కార్యక్రమాలు, ఎల్లమ్మ తల్లి బోనాలు తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మంత్రులకు ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, బాలకిషన్, శ్రీనివాస్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, కిషన్ గౌడ్, నారా గౌడ్, సిద్ధా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.