calender_icon.png 19 October, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తపాల జీవిత బీమాతో ధీమా...

18-10-2025 07:28:52 PM

కరీంనగర్ డివిజన్ పోస్టల్ ఎస్పీ కె.శివాజీ

కరీంనగర్,(విజయక్రాంతి): నమ్మకం.. భద్రత... అనే ముద్ర వేసుకున్న తపాల శాఖ ప్రజల మరింత భద్రత కోసం తపాల జీవిత బీమా పాలసీలను అమలుచేస్తోందని, తపాలా జీవిత బీమాతో ధీమా లభిస్తుందని కరీంనగర్ డివిజన్ పోస్టల్ ఎస్పీ కె.శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో తక్కువ ప్రీమియం.. ఎక్కువ బోనస్... లభించే విధంగా బీమా పాలసీలను రూపొందించడం విశేషమని, తపాల జీవిత బీమాతో డబ్బులు పొదుపు  కావడమేకాక ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి బీమా రూపంలో పరిహారం అందిస్తూ ధీమానిస్తున్నదని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న తపాల శాఖ కార్యాలయంలో తీసుకోవచ్చని, ప్రజలను ఎక్కువ సంఖ్యలో తపాల జీవిత బీమాలో చేర్పించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.