6 August, 2026 | 2:31 AM

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

06-08-2026 12:00 AM

నాగోల్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ

అబ్దుల్లాపూర్ మెట్, ఆగస్టు 5: సైబర్ నేరాల పట్ల ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని ఇన్ స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీఅన్నారు. సైబర్ జాగరూకత దివస్‌సందర్భంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఎల్బీనగర్ జోన్  నాగోల్ సర్కిల్  కుంట్లూర్ డివిజన్ పరిధి తట్టిఅన్నారంలోని  శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.   

విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహమ్మద్ మక్బూల్ జానీ మాట్లాడుతూ... ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ వంటి గోప్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా, ఆన్లైన్ షాపింగ్, పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో, అలాగే డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ కు ఫోన్ చేయడంతో పాటు cybercrime.gov.in వ్బుసైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సి. ఉదయ్ కిరణ్, అధ్యాపకులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.