11-09-2024 12:00:00 AM
ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఐఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 సిరీస్‌ను యాపిల్ న్యూయార్క్‌లో ఆవిష్కరించింది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో డిజైన్ చేసిన తమ తొలి స్మార్ట్‌ఫోన్ అని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌కు ఆర్డర్ల బుకింగ్ సెప్టెంబర్ 13న మొదలవుతాయి. సెప్టెంబర్ 20 నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది. సోమవారం రాత్రి యూఎస్‌లో జరిగిన యాపిల్ ఈవెంట్‌లో ఐఫోన్ 16 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4లను కూడా ఆవిష్కరించింది. అలాగే యాపిల్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్‌లకు కొన్ని అప్‌డేట్స్‌ను ప్రకటించింది.
కొత్త ఐఫోన్ ఫీచర్లు
భారత్‌లో ధర
యాపిల్ ఐఫోన్ 16 ప్రొ మోడల్స్‌ను గత ఐఫోన్ 15 ప్రొ మోడల్స్‌కంటే తక్కువ ధరకు లభిస్తాయి. యాపిల్ చరిత్రలో గత మోడల్స్‌కంటే కొత్త మోడల్స్ ధరల్ని తక్కువగా నిర్ణయించడం ఇదే ప్రధమం. ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొమ్యాక్స్‌లు ఐఫోన్ 15 ప్రొ, ఐఫోన్ 15 ప్రొమ్యాక్స్‌లకంటే రూ.15,000 తక్కువగా అందుబాటులో ఉంటాయి. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో సుంకాల్ని తగ్గించిన ఫలితంగా కొత్త ఐఫోన్ల ధరలు తగ్గనున్నాయి.
దేశంలోనే తయారీ
ఐఫోన్ 16 ప్రొ మోడల్స్‌ను యాపిల్ భారత్‌లోనే తయారు చేస్తున్నది.