21-05-2025 12:01:24 AM
హైదరాబాద్ (విజయక్రాంతి): పాలీటెక్నిక్స్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(Polytechnics Common Entrance Test)కు రాష్ట్ర వ్యాప్తంగా 94.02 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. లాటరల్ ఎంట్రీ ద్వారా ఈ పరీక్ష ద్వారా రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 635 మంది దరఖాస్తు చేసుకోగా, 597 మంది పరీక్షకు హాజరైనట్లు ఎస్‌బీటెట్ కార్యదర్శి బి.శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.