24-12-2025 03:49:41 PM
విద్యార్థులను అభినందించిన చైర్మన్ సంజీవ్ కుమార్, ప్రిన్సిపాల్ కృష్ణ ప్రియా
సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ పాఠశాల (ఐపిఎస్) విద్యార్థులు ప్రతిభ కనబరిచి పాఠశాల ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో ఈనెల 22 నుండి 24 తేదీలలో రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన 14 సంవత్సరాల బాలబాలికల రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఐపిఎస్ విద్యార్థులు ఎనిమిదవ తరగతి చదువుతున్న ఎం.సంప్రీత్, ఏడవ తరగతి చదువుతున్న ఈ వర్షిత ఉత్తమ ఆటతీరుతో బ్రాంజ్ మెడల్స్‌ను కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ లు బుధవారం విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరింత మెరుగైన ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం పాఠశాలకు గర్వకారణమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ, శివ, సతీష్, మమత, విద్యార్థులు పాల్గొన్నారు.