24-12-2025 03:52:47 PM
శబరిమలకు బయలుదేరిన కోవలక్ష్మి
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు గురుస్వామి నాగేష్ శర్మ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఎమ్మెల్యే అయ్యప్ప స్వామి ఇరుముడిని ధరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతటా స్వామియే శరణం అయ్యప్ప శరణం నామస్మరణ మార్మోగింది. ఇరుముడి ధరించిన అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్వాములతో కలిసి శబరిమల యాత్రకు బయలుదేరారు. మార్గమధ్యలో మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ కలగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రార్థించారు.