17-12-2025 12:38:45 AM
ప్రైవేట్ వ్యాపారస్తుల కొనుగోళ్లపై ఆరా...
ఆదిలాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాం తి): ఆదిలాబాద్ పత్తి మార్కెట్‌పై రాష్ట్ర విజిలెన్స్ అధికారుల బృందం దృష్టి సారించిం ది. పత్తి కొనుగోలులో జరుగుతున్న అక్రమాలు, రైతులు పడుతున్న ఇబ్బందులు, మార్కెట్ కు రాకుండా ప్రైవేట్ వ్యాపారస్తులు కొంటున్న పత్తి వివరాలు తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. మంగళవారం ఆదిలాబాద్‌లో విజిలెన్స్ బృందం అధికారులు అనిల్ కుమార్, దినేష్ చంద్ర, వరుణ్ ప్రసాద్, ప్రశాంత్ రావులు తనిఖీలు చేశారు.
మార్కెట్ యార్డ్‌లో ఉన్న పత్తి కాంటాలను పరీక్షించి, ప్రైవేట్ జిమ్మింగ్ మిల్ నుండి తెమశాతం ఎక్కువ ఉంది అని వెనక్కి పంపిన పత్తి బండి నుండి పత్తి తేమ శ్యాంపుల్‌ను సేకరించారు. సీసీఐ పత్తి తేమ శాతంలో తేడా రావటంతో పలు జీన్నింగ్ ఫ్యాక్టరీలలో తేమ శాతం మెషిన్ లను తనిఖీ చేశారు.మరోవైపు పత్తి మార్కెట్ జరుగుతున్న అక్రమాల, సమస్యలపైన విజిలెన్స్ అధికారులకు జాగృతి జిల్లా నాయకులు వివరించారు.
వేలి ముద్ర వ్యవస్థతో వృద్ధ రైతులు పడుతున్న ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రక్త సం బంధికులలో ఒకరి వేలిముద్ర అయినా అనుమతి ఇవ్వాలని కోరారు. పత్తి నాసిరకం వస్తుంది అనే కారణంతో మరోసారి రూ.50 ల ధర తగ్గించనుందని ఇప్పటికె రైతు అధిక వర్షాలతో నష్టాల్లో ఉన్నాడని ధరలు పెంచాల్సిన సమయంలో ఈ విధంగా తగ్గిస్తున్నారని అన్నారు. తేమ శాతం 8 వచ్చిన పత్తికి ఇన్సెంటివ్‌లు కూడా ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వలేద ని అవి రైతులకు ఇప్పించాలని కోరారు.