17-12-2025 12:37:32 AM
సీసీఐ సంస్థ చైర్మన్ హామీ...
ఆదిలాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాం తి): ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీ ఎంప్లాయిస్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను వెంటనే అమలు చేస్తానని సీసీఐ సంస్థ ఛైర్మెన్ సంజ య్ భాంగ్రా హామీ ఇచ్చారు. సీసీఐ ఎంప్లా యీస్‌కు వి.ఎస్.ఎస్ బెనిఫిట్స్, పెండింగ్ అ మౌంట్ తొందరగా చెల్లించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ నేతృత్వంలో ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్. విలాస్, నిరంజన్ రావు మంగళవారం ఢిల్లీలో ఆ సం స్థ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
ఎంప్లాయీస్ విషయంలో కోర్టు ఆర్డర్‌ను వెంటనే అమలు చేసి, సమస్యలు పరిష్కరి స్తామని చైర్మన్ హామీ ఇచ్చారని వారు పేర్కొ న్నారు. ఆదిలాబాద్‌లో సంస్థ ప్రతినిధులు ఎవరూ లేరని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా, సమ స్య పరిష్కారంకు ఢిల్లీ నుండే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు.