17-12-2025 12:40:13 AM
హైదరాబాద్‌సిటీ బ్యూరో, డిసెంబర్ ౧౬ (విజయక్రాంతి): ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం బాండీ బీచ్‌లో కాల్పులకు పాల్పడి 15 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్న షూటర్లు సాజిద్ అక్రమ్, అతడి కుమారుడు నవీద్ అక్రమ్ మూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలంగాణ పోలీసులు ధ్రువీకరించారు. ఈమేరకు మంగళవారం డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఆస్ట్రేలియన్ పోలీసుల కాల్పుల్లో సాజిద్ అక్రమ్ మృతిచెందాడని, కుమారుడు నవీద్ అక్రమ్‌ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
సాజిద్‌కు వ్యతిరేకంగా భారత్‌లో ఎలాం టి ప్రతికూల రికార్డులు, క్రిమినల్ కేసులూ లేవని స్పష్టం చేశారు. ఆస్టేల్రియా వెళ్లిన త ర్వాత సాజిద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు సాజిద్ నేర చరిత, ఉగ్రవాద లింకులపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే కాల్పులకు నెల రోజుల ముందు సాజిద్, అతడి కుమారుడు ఫిలిప్పి న్స్, పాకిస్థాన్ వంటి దేశాలకు వెళ్లినట్లు నిఘావర్గాలు గుర్తించినట్లు, ఆధారాలు సేకరించాయి.
సాజిద్ ఇండియన్ పాస్‌పోర్ట్‌పై, నవీద్ ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్‌పై ప్రయాణించినట్లు తేలింది. సాజిద్‌కు ఆస్ట్రేలియా పౌరసత్వం ఉన్నప్పటికీ, అతడు భారత పాస్‌పోర్ట్ వినియోగిస్తుండటం గమనార్హం. సాజిద్ ఆరుసార్లు భారత్‌కు రాగా, చివరిసారిగా అతడు 2022లో హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిసింది. కాల్పుల వెనుక ప్రత్యక్షంగా ఏదై నా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల హస్తం ఉందా? లేదంటే.. సాజిద్ కేవలం ఒక స్లీపర్ సెల్ మాత్రమేనా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి.
ఇప్పటికే ప్రత్యేక బృందాలు సాజిద్ కుటుంబ సభ్యులను అనేక కోణాల్లో విచారించాయి. మరికొంతమందిని కూడా విచారిస్తాయని తెలిసింది. ఆస్ట్రేలియా నిఘా ఏజెన్సీల ఇచ్చిన సమాచారం ఆధారంగా నిఘా సంస్థలను దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నాయి.
అక్కడి నిఘా వర్గాలు మాత్రం కాల్పుల వెనుక ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) హస్తం ఉన్నట్లు భావిస్తున్నాయి. కాల్పు ల ఘటనను ఆ ప్రభుత్వం యూదు వ్యతిరేక ఉగ్రవాద చర్యగా పరిగణిస్తోంది. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారంతో దాడి వెనుక ఉన్న వాస్తవాలను రాబట్టేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేయిస్తున్నది.
క్రిస్టియన్‌ను పెళ్లి చేసుకున్నందుకే తెగదెంపులు
కాల్పుల ఘటనపై హైదరాబాద్‌లోని టోలీచౌక్‌లో నివాసం ఉంటున్న ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు దిగ్భ్రాంతి చెందారు. సాజిద్‌కు తమకు ఎలాంటి సత్సంబంధాలు లేవని స్పష్టం చేస్తున్నారు. పాతికేళ్ల నుంచి సాజిద్‌తోపాటు అతడి కుటుంబానికీ దూరంగా ఉంటున్నామని చెప్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సాజిద్ తండ్రి బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. తండ్రి సంపాదించి తిరిగి వచ్చాక 1998లో సాజిద్‌ను పైచదువుల కోసం స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా పంపాడు.
తర్వాత కేవలం ఆరుసార్లు హైదరాబాద్ వచ్చాడు. సాజిద్ అక్రమ్ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘సాజిద్ 27 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ ఒక క్రైస్తవ మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో మా కుటుంబం అతడికి దూరమైంది. మా అమ్మ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోంది. ఆమె బాగోగులను కూడా సాజిద్ ఏనాడూ పట్టించుకోలేదు. సాజిద్‌కు ఇద్దరు పిల్లలున్నారని మాత్రమే మాకు తెలుసు’ అని తెలిపాడు.