calender_icon.png 5 September, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు కలగానే ఇందిరమ్మ ఇల్లు?

05-09-2025 12:40:27 AM

  1. గ్రామాల్లో రాజకీయ పలుకుబడి ఉన్న వారికే ఇండ్లు మంజూరు 

స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలను నిలదీతలకు దారితీసే పరిస్థితులు 

అలంపూర్, సెప్టెంబర్ 04 : రాష్ట్ర ప్రభు త్వం అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిర మ్మ ఇండ్లు మంజూరు చేసి పేదవాడి ఇంటి కళను సొంతం చేస్తామని ప్రగల్భాలు పలుకుతోంది.ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెళుతు న్న క్రమంలో అధికారులు, స్థానిక రాజకీయ నాయకుల తీరుతో ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేక గ్రామాల్లో ఉండే చోటా మోటా రా జకీయ నాయకులు అధికారులను మచ్చిక చేసుకుంటూ వారిచ్చే కాసులకు కక్కుర్తి పడి అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతుంది.

రాజకీయ నాయకుల అండదండలు మెండుగా ఉన్నవారికే లిస్టులో పేర్లు రావడంతో కాంగ్రె స్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. నియోజకవర్గ వ్యా ప్తంగా గ్రామాల్లో ఉన్న రాజకీయ నాయకు zలు నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులను మరచి వారికి అనుకూలమైన వారికి ఇండ్ల మంజూరులో పేర్లు కల్పిస్తున్నట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జీవనోపాధి కోసం కాయ కష్టం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే నిరుపేదలకు ప్రభుత్వం అం దించే ఏ సంక్షేమ పథకాలు అందడం లేదనే చర్చ జరుగుతుంది. రాజకీయ ప్రోత్బలం ఉ న్నవారికే తప్ప నిరుపేదలకు శూన్యం గా మారిందని ఆయా గ్రామాల్లోని లబ్ధిదారు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ క మిటీలు పేరుకే తప్ప ..

దేనికి పనికి రాకుండా పోతుందని కమిటీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరిం చడం పట్ల పార్టీలోనే వారికి సఖ్యత లేక వర్గాలుగా ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీంతో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది.ఇటీవలే రాజోలి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన దంపతులు ఇందిరమ్మ ఇంటి కోసం జిల్లా కలెక్టర్ ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

నాయకుల తీరుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల నుంచి అసమ్మతి సెగలు, నిలదీతలు తలెత్తే పరిస్థితులు రావచ్చనే చర్చ ప్రజల్లో జరుగుతుంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి నిజమైన అర్హత కలిగిన అర్హులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అర్హత కలిగిన నిరుపేదలు కోరు తున్నారు. 

లిస్టులో పేరుకు ముడుపులు తీసుకుంటున్నట్లు చర్చ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు కోసం లిస్టులో పేరు వచ్చేందుకు నిరుపేదలు నానా అవస్థలు పడుతున్నారు. ఇండ్ల మంజూరుకు అధికారులు రూ. 20 నుంచి 30 వేల వరకు ముడుపులు అందుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఇటీవలే అలంపూర్ పరిధిలో ఓ మండల స్థాయి అధికారిని అనర్హులకు ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో పేరు రావడంపై గ్రామస్తులు అభ్యంతరం తెలపగా సదరు అధికారి లిస్టులో పేరు కోసం అతను ఏకంగా ఓ రాజకీయ నాయకుడితో 30 సార్లు ఫోన్ చేయించారని సమాధానం ఇచ్చినట్టు సమాచారం.

 పారదర్శకంగా అమలు చేయాలి 

రాజకీయాలకు అతీతంగా ఎలాంటి వత్తిళ్లకు అధికారులు లొంగకుండా పారదర్శకంగా అర్హులైన నిరుపేదలకే ఇందిర మ్మ ఇండ్లు మంజూరు చేయాలి. కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం . నిరుపేదలకు గూడు లేనటువంటి వారికే ఇల్లు మంజూరు చేయాలి

 దుబ్బన్న, చెన్నిపాడు గ్రామం 

నేటికీ పూరి గుడిసెలోనే అవస్థలు 

మాది మానవపాడు గ్రామం నాకు ఐదు మంది సంతానం సెంటు భూమి లేదు.నేటికీ పూరి గుడిసెలోనే నివాసం ఉంటున్నాను. వర్షాకాలం వస్తే కొట్టానికి తట్టు కట్టుకున్నాను.. రెక్కాడితే గాని డొక్కడనే పరిస్థితి. ఇందిరమ్మ ఇంటి కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన ఎవరు పట్టించుకోలేదు. గ్రామంలో భూముల, ఆస్తు లున్నలకు ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. ప్రభుత్వం నా పరిస్థితి తెలు సుకొని ఇంటినిమంజూరుచేయాలి.

రాములమ్మ, మానవపాడు గ్రామం