calender_icon.png 7 September, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు గురుబ్రహ్మ అవార్డు

05-09-2025 12:41:27 AM

మంచిర్యాల, సెప్టెంబర్ 4 (విజయక్రాం తి) : మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ముత్యం బుచన్నకి గురుబ్రహ్మ అవార్డు లభించింది. గణిత ఒలింపియాడ్‌లో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా హైదరాబాద్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో శ్రీనివా స రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాశ్ నారాయణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

గణిత శాస్త్ర బోధనలో విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధం చేయడంలో బుచ్చన్న చేసిన కృషి ఫలితమే ఈ అవార్డుకు కారణమని మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య, ఎంఈఓ మాలవీ దేవి అభినందించారు. ప్రన్సిపాల్ బుచ్చన్నకు అవార్డు రావడం పట్ల స్కూల్ అధ్యాపక బృందం, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.