calender_icon.png 5 September, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతన్నకు ‘పెద్ద’ వాగు!

05-09-2025 12:39:22 AM

- కరువును తరిమేసిన మోయ తుమ్మెద వాగు

- వాగు పై తొమ్మిది చెక్ డ్యామ్‌ల నిర్మాణం

- 1500 ఎకరాలకు పుష్కలంగా నీరు

- ఫలించిన కేసీఆర్, హరీశ్ కృషి

నంగునూరు, సెప్టెంబర్ 4: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో మోయ తుమ్మెద వాగు నాడు కరువుకు చిహ్నంగా నేడు జీవనానికి వారధి నిలిచింది. దీన్ని పె ద్ద వాగు అని కూడా పిలుస్తారు. వేసవి వ చ్చిందంటే వందల ఎకరాలు బీడు భూములుగా మారిపోయేవి. వాగులోని నీళ్లన్నీ ఆవిరై ఎటుచూసిన ఇసుక మేటలు, పగిలిన నేల మాత్రమే కనిపించేది.

భూగర్భ జ లాలు పాతాళానికి చేరడంతో రైతుల కరెం టు బిల్లుల కోసం వెయ్యిలు ఖర్చు చేసిన బోరు బావుల్లో చుక్కనీరు కూడా కనిపించే ది కాదు. ఎందరో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి, భూములను వదిలి పట్టణాలకు వలస వెళ్లేవారు. ఇది ఈ ప్రాంతంలోని గ్రామాలైన నంగునూరు, గట్లమల్యా ల, ఖాతా, కొండంరాజుపల్లి, ఘనాపూర్, అక్కనపల్లి ప్రజల నిత్యజీవితంలో ఒక విషాద గాధ. 

ఆ కష్టం తీర్చాలని..

మాజీ సీఎం కెసిఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో నీటి సమస్యను పరిష్కరించడానికి కొత్త ఆలోచన చే శారు. కేవలం వర్షాలపై ఆధారపడకుం డా, వాగులో ఎల్లప్పుడూ నీరు ఉండేలా చూడాలనే లక్ష్యంతో చెక్ డ్యామ్ నిర్మించా రు. ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అదే వాగుపై మరో ఎనిమిది చెక్ డ్యామ్లను నిర్మించారు. ప్రస్తుతం తొమ్మిది చెక్ డ్యా మ్లను అనుసంధానం చేయడం వల్ల నీరు నిలవడంతో ఈ ప్రాంతం జలకళను సంతరించుకుంది.

అక్కెనపల్లి, ఘనాపూర్, ఖాత గ్రామాలలో నిర్మించిన చెక్ డ్యామ్లు, వాటి బ్రిడ్జిల వల్ల వాగు ఒక పెద్ద జలాశయంగా మారింది. ఈ వాగు సుమారు 14 కి.మీ. పొడవునా భారీ రిజర్వాయర్గా మారింది. ఇక్కడ చెక్ డ్యామ్ల నిర్మాణంతో మండలంలోని 10 గ్రామాల లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దాంతో 15వందల ఎకరాలకు పైగా పంటలకు సాగునీరు అందడంతో మండలంలో వ్యవసాయానికి కొత్త ఊపిరి పోశాయని చెప్పవచ్చు.

ప్రస్తుతం జలకళతో నిండుకుండలా..

రంగనాయక సాగర్ జలాలతో నిండి ఉన్న మోయతుమ్మెద వాగు భారీ వర్షాల తో పూర్తిగా జలకలను సంతరించుకుంది. పెద్దవాకపై తొమ్మిది చెక్ డ్యాములన్ని నిం డి, మత్తల్లు దుంకుతుండడంతో వాగు కళకళలాడుతుంది. ఈ దృశ్యాలతో రైతులు గతంలో పడిన కష్టాలని మరిచిపోయి సం తోషం వ్యక్తం చేస్తున్నారు. 

పెద్ద వాగులోకి కాళేశ్వరం జలాలు 

చెక్ డ్యామ్ ల నిర్మాణంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక సాగర్ జలాలను హరీష్ రావు దృడ సంకల్పంతో ఈ వాగులోకి మళ్ళించారు. గతం లో ఎప్పుడు లేని విధంగా గోదావరి జలాలు ఈ ప్రాంతానికి చేరడం హరీష్ రా వు కృషివల్లే సాధ్యమైంది. ఆయనకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. 

   మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి. నంగునూరు. 

నాడు పంటలు ఎండిపోయాయి

ఒకప్పుడు ఎండిపోయి కనిపించిన ఈ వాగు, చెక్ డ్యామ్లను నిర్మించి నీటిని నిల్వ చేయడం ద్వారా వ్యవసాయానికి కొత్త జీవనాన్ని కెసిఆర్, హరీష్ రావు అందించారు. వారి సంకల్పం లేకపోతే ఈనాడు వాగుపై ఇంతగా జీవం పోసుకునీ ఉండేది కాదు.

  మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, నంగునూరు 

సంతోషంగా ఉంది..

గతంలో వర్షాల కోసం ఆకాశం వైపు చూసే వాళ్ళం బోరువేసిన చుక్క నీరు వచ్చేది కాదు ఇప్పుడు కళ్ళ ముందు వాగు నిండుగా కనిపిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. కెసిఆర్, హరీష్ రావు కృషి ఫలితంగానే మా జీవితాల్లో వెలుగులు వచ్చాయి. మా తర్వాత తరాలకు కూడా తాగునీరు సాగునీటికి ఏలాంటి ఇబ్బందులు ఉండకుండా చేశారు.

  బద్దిపడే కృష్ణారెడ్డి, రైతు అక్కెనపల్లి.