calender_icon.png 15 September, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిత్యం తిట్ల దండకమేనా?

18-08-2024 12:00:00 AM

తెలంగాణలో ప్రతి అంశమూ రాజకీయమయిపోతోంది. ముఖ్యంగా ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి పాలయి, కాంగ్రెస్ ప్రభు త్వం గద్దెనెక్కినప్పటినుంచి ఇది మరీ ఎక్కువయింది. అధికా రంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అలవిమాలిన హామీలు ఇవ్వడం, వాటి అమలులో ఆలస్యం కావడం ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు ఆయుధంగా మారింది. తెల్లారినప్పటినుంచి ఉచిత బస్సు ప్రయా ణం, రుణ మాఫీ, రైతు భరోసా.. ఇలా ఏదో ఒక అంశంపై ఆ పార్టీ నేతలు అధికార కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ నేతలు మరో అడుగు ముందుకు వేసి  కారు పార్టీపై నిప్పులు కక్కుతున్నారు. సోషల్ మీడియాలో చూసే వారి కి ఇది బాగానే ఉంటుందేమో కానీ సామాన్య ప్రజలకు మాత్రం రోత పుడుతోంది. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు జనానికి తిండిపెట్టవు. వారి ఊరికి ఓ రోడ్డో, బడో వస్తే వారు సంతోషి స్తారు కదా.

  బిక్షమయ్యగౌడ్, నర్సంపేట