calender_icon.png 18 October, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన్డేల్లోనూ శుభ్ ఆరంభమేనా ?

17-10-2025 01:10:19 AM

-గిల్‌కు కంగారూ చాలెంజ్

-యువ కెప్టెన్‌కు మరో పరీక్ష

పెర్త్, అక్టోబర్ 16: భారత క్రికెట్‌లో ఇప్పుడు వన్డే జట్టుకు సంబంధించి కూడా కొత్త శకం మొదలుకాబోతోంది. టెస్ట్ జట్టు సారథిగా ఇంగ్లాండ్ టూర్‌కు ముందు బాధ్యతలు అందుకున్న యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇప్పుడు వన్డే జట్టు పగ్గాలు కూడా చేప ట్టాడు. ఊహించినట్టుగానే ఆస్ట్రేలియాతో సిరీస్ నుం చి వన్డేల్లోనూ టీమిండియాను నడిపించబోతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకు ని రోహిత్ శర్మను తప్పించిన సెలక్టర్లు గిల్‌ను అతని వారసుడిగా ఎంపిక చేశారు.

ఇంగ్లాండ్ టూర్‌లో టెస్ట్ సిరీస్‌ను సమం చేసినప్పుడే వన్డే పగ్గాలు కూడా అతనికే ఇస్తారని చాలా మంది ఫిక్స్ అయ్యారు. చివరకు అదే నిజమైంది. అయితే తొలి సిరీస్‌తోనే వన్డే సారథిగా గిల్‌కు అసలైన సవాల్ ఎదురవుబోతోంది. ఎందుకంటే ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ జట్టుగా ఉన్న ఆస్ట్రేలియాను వాళ్ల సొంతగడ్డపై ఓడించడం అంత ఈజీ కాదు. అలా అని అసాధ్యం కూడా కా దు.. కానీ ఇలాంటి చాలెంజింగ్ సిరీస్‌లో జట్టును నడిపించడమే గిల్‌కు ఎదురయ్యే మొదటి సవాల్. ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్‌లో కెప్టెన్సీతో ఆకట్టుకున్న గిల్‌కు ఆసీస్ గడ్డపై సారథ్యం కొంచెం భిన్నంగానే ఉంటుంది.

ఇంగ్లాండ్‌తో పోలిస్తే సొంతగడ్డపై కంగారూలు చాలా స్ట్రాంగ్. అలాగే వారి బౌలింగ్ లైనప్ ఎలా ఉంటుందో కూడా తెలుసు. పైగా తమ ఫాస్ట్ పిచ్‌లపై ఎంతలా చెలరేగిపోతారో కూడా తెలుసు. ఈ నేపథ్యంలో గిల్‌కు ఆసీస్‌తో సిరీస్ ఖచ్చితంగా అగ్నిపరీక్షగా నే చెప్పాలి. అదే సమయంలో సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో ఉండడం పెద్ద అడ్వాంటేజ్. వీరిద్దరూ లేకుండానే ఇంగ్లాండ్ గట్ట పై భారత్ అదరగొట్టింది. ఇప్పుడు రోకో ద్వయం జట్టులోకి రావడంతో గిల్ కు మానసికంగానూ బలమనే చెప్పాలి. రోహిత్‌తో మంచి బాండింగే ఉండడంతో జట్టు వ్యూహాల్లో ఖచ్చితంగా హిట్‌మ్యాన్ సలహాలు తీసుకుంటాడు. ఈ విషయాన్ని ఇటీవల ప్రెస్‌మీట్‌లో గిల్ స్వయంగా వెల్లడించాడు. దీంతో కెప్టెన్సీ విషయంలో రోహిత్ ప్రోత్సాహం ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.

ఇదిలా ఉంటే నాయకుడంటే కెప్టెన్సీ మాత్రమే కాదు వ్యక్తిగతంగానూ రాణించాల్సి ఉంటుంది. కెప్టెన్సీ ఒత్తిడితో వ్యక్తిగత ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లను గతంలో చాలామందిని చూశాం. అలాంటి పరిస్థితి గిల్‌కు రాకపోవచ్చు. ఎందుకంటే ఇం గ్లాండ్ టూర్‌లో గిల్ బ్యాట్‌తో దుమ్మురేపాడు. 700 ప్లస్ రన్స్‌తో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పుడు ఆస్ట్రే లియాలోనూ ఈ యువసారథి చెలరేగితే అత నికి తిరుగుండదని చె ప్పొచ్చు. ఓవరాల్‌గా ఆసీస్‌పై 8 వన్డేలు ఆడిన గిల్ 280 పరుగులు చేయగా.. దీనిలో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉంది. కానీ ఆసీస్ గడ్డపై మాత్రం ఇప్పటి వరకూ ఒకే ఒక వన్డే ఆడిన గిల్ 33 పరుగులే చేశాడు. ఇదిలా ఉంటే గిల్‌కు మరో సవాల్ తుది జట్టు ఎంపిక. ఆస్ట్రేలియా పిచ్‌లు సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకే అనుకూలంగా ఉంటాయి. ఒక్కోసారి బ్యాటర్లకు కూడా సహకరిస్తుంటాయి. పేసర్లను సమతూ కంగా తీసుకుని, ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యతనిస్తూ ఫైనల్ కాంబినేషన్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.