calender_icon.png 18 October, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలికట్ హీరోస్ తొలి విజయం

18-10-2025 12:48:30 AM

ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 4

హైదరాబాద్, అక్టోబర్ 17: ఆర్‌ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 4లో డి ఫెండింగ్ చాంపియన్ కాలికట్ హీరోస్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. గచ్చి బౌలీ స్టేడియంలో కోల్‌కత్తా థండర్‌బోల్ట్స్‌పై 3 సెట్ల తేడాతో విజయం సాధిం చింది. మోహన్ ఉక్రపాండియన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సంతోష్, తరుశ చామత్ కీలక సమయాల్లో పాయింట్లు సాధించి కాలికట్‌కు విజయాన్నందించారు. మరో మ్యాచ్‌లో చెన్నై బ్లిట్జ్ 3 సెట్ల తేడాతో ఢిల్లీ తుఫాన్స్‌ను చిత్తు చేసింది. సమీర్ చౌదరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో చెన్నై బ్లిట్జ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.