సిద్ధికీ తెలుగు భాషాభిమానం
ఆర్ట్స్ కాలేజీలో మా తెలుగు డిపార్ట్‌మెంట్ పక్కనే ఇస్లామిక్ స్టడీస్ డిపార్ట్‌మెంటు ఉంది. నాకు చిన్నప్పటి నుంచే వేదాంతం వంటబట్టింది. అందుకు కారణం పాతపట్నంలోని పండిత గుండేరావు హర్కారే గారే. తరచుగా సులేమాన్ సిద్ధికీ తెలుగులో మాట్లాడుతుండేవాడు. ఆయన తెలుగువాడా అనిపించే విధంగా, ఉచ్చారణ ఉండేది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం అనగానే ‘ఆర్ట్స్ కాలేజీ’ గుర్తుకు వస్తుంది. ఆర్ట్స్ ఫ్యాకల్టీకి చెందిన అన్ని కో ర్సులు ‘ఆర్ట్స్ కాలేజీ’ భవనంలో కొలువుదీరాయి. ఈ విశాలమైన భవనంలో ఆ ర్కియాలజీ మొదలుకొని ఇస్లామిక్ స్టడీస్ వరకు, జర్నలిజం మొదలుకొని థియేటర్ ఆర్ట్స్ వరకు, తెలుగు మొదలుకొని రష్యన్ భాషల వరకు అధ్యాపనం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఆర్ట్స్, సోషల్ సెన్సైస్ సామాజిక శాస్త్రాలలో పరిశోధనలు జరగడం విశేషం.
ఆర్ట్స్ కళాశాల ఆరంభమై నేటికి నూరేళ్లు నిండాయి. ఇక్కడ అధ్యయనం, పరిశోధన చేసిన వారు వేలకొలది దేశ విదేశాల్లో ఆయా రంగాల్లో విశిష్టమైన సేవలను అందించడం గమనార్హం. ప్రపంచం లోనే సుప్రసిద్ధమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కాలేజీ ప్రసిద్ధి చెందిన అ న్ని భాషలకు, ఆర్థిక, రాజకీయ శాస్త్రాలకు పట్టుగొమ్మగా నిలిచింది. విశేషమేమంటే దేశంలోని ప్రముఖ విద్యావేత్తలకు ఈ కళాశాలలో విద్యా బోధన చేసే అవకాశం కలిగింది.
మత సామరస్యం
మత సామరస్యానికి ఆర్ట్స్ కళాశాల మొదటి నుంచి ప్రాధాన్యం ఇచ్చింది. తెలు గు, హిందీ, ఆంగ్లం బోధించే అధ్యాపకులు గాని, ఉర్దూ, పర్షియన్ భాషలను బోధించే అధ్యాపకులు గాని ఎన్నడూ భాషా సం బంధమైన వైరాలకు పాల్పడలేదు. చిత్రమేమిటంటే తెలుగు పిల్లలు హిందీ, ఇంగ్లీషు భాషల్లో అధ్యయనం కొనసాగిస్తే, మరికొందరు, భాషా శాస్త్రం, ఇస్లామిక్ స్టడీస్ మొదలైన సబ్జెక్టుల్లో రాణించారు.
ఈ కళాశాలలో ఫిలాసఫీ శాఖకు ఎంతో ప్రాధా న్యం ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ శాఖలోని అధ్యాపకులు కళాశాలలో ఎల్లవేళల సామరస్యాన్ని కాపాడినారు. ఆశ్చర్య మైన విషయం ఏమంటే ఇస్లామిక్ స్టడీస్‌లో మన తెలుగు విద్యార్థులు చేరి ప్రతిభ ను చూపించారు. ‘ఇస్లామిక్ స్టడీస్’ అధ్యాపకులనగానే ఆచార్య మహమ్మద్ సులే మాన్ సిద్ధికీ గుర్తుకు వస్తాడు. ఆయన హైదరాబాదు వాస్తవ్యుడు. ఉర్దూ ఎంత చక్కగా మాట్లాడగలడో, తెలుగు అంత చక్కగా మాట్లాడగలడు.
తెలుగువాడా అన్నంతలా
ఆర్ట్స్ కాలేజీలో మా తెలుగు డిపార్ట్‌మెంట్ పక్కనే ఇస్లామిక్ స్టడీస్ డిపార్ట్‌మెం టు ఉంది. నాకు చిన్నప్పటి నుంచే వేదాం తం వంటబట్టింది. అందుకు కారణం పాతపట్నంలోని పండిత గుండేరావు హర్కారే గారే. తరచుగా సులేమాన్ సిద్ధికీ తెలుగులో మాట్లాడుతుండేవాడు. ఆయన తెలుగువాడా అనిపించే విధంగా, ఉచ్చారణ ఉండేది. క్రమశిక్షణ కలిగిన సిద్ధిఖీ క్రమంగా పదోన్నతులు పొంది, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడ య్యాడు.
అన్ని భాగాల వారికి, అన్ని మతాల వారికి ఆత్మీయుడుగా మెలిగే సిద్ధి కీ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష పదవిలో ఉం డడం అందరికీ సంతోషాన్ని కలిగించింది. అది 2007.. సులేమాన్ సిద్ధికీ హయాం లో దూరవిద్యా కేంద్రంలో ఒక కొత్తకోర్సు మొదలైంది. ఆ కోర్సులో ప్రవేశాన్ని పొం దినవారుంతా డిగ్రీ చదివే పిల్లలే. తార్నాక, ఉప్పల్ మధ్య రోడ్డు ప్రక్కన ‘జెన్‌పాక్’ అనే ఐటీ సంస్థ ఒకటి కొత్తగా ఆవిర్భవించింది.
ఆ సంస్థ వారు ఇంటర్ పాసైన వారికి పరీక్షపెట్టి, మెరిట్‌ను బట్టి తమ సంస్థలో ఉద్యోగాల్లో ప్రవేశింపజేశారు. ఇక్కడే ‘జెన్‌పాక్ విశ్వవిద్యాలయం’ వారి దూరదృష్టి , బుద్ధి పరిణతి అభివ్యక్తమవుతుంది. రెండు సంస్థల వారు ఒక ఆలోచనకు వచ్చి సెలెక్ట్ అయిన విద్యార్థులు దూర విద్యాకేంద్రం లో వారానికి రెండు రోజులు, డిగ్రీ విద్యనభ్యసిస్తూ మిగతారోజులు కంపెనీలో ఉద్యో గం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. రెం డు సంస్థలూ ఒకవైపు చదువు, మరొకవైపు ఉద్యోగం, ఈ రెండింటినీ కొనసాగిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపినారు.
క్లాసులు చెప్పాల్సిందే
ఈ ఏర్పాటంతా విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుల పర్యవేక్షణలో జరిగింది. ప్రొఫెసర్ జి. రాంరెడ్డి దూరవిద్యా కేంద్రంలో విద్యార్థులకు తరగతులు మొదలయ్యాయి. మా విశ్వవిద్యాలయంలో పనిచేసే ఆచార్యులే తరగతులు నిర్వహిస్తారు. ఆంగ్లంలోనే వి ద్యాబోధన జరిగినప్పటికీ, ద్వితీయ భాష గా విద్యార్థులు సంస్కృతం, హిందీ, తెలు గు మొదలైన భాషల్లో ఏదో ఒక దానిని ఎన్నుకోవచ్చు.
ద్వితీయ భాషగా ఆయా భాషలను ఎన్నుకున్న వారి దరఖాస్తు ఫారాలను పరిశీలించినప్పుడు తెలుగుకు ఒక్కడంటే ఒక్కడే ఉన్నాడు. ఈ విషయం వీసీ గారి దృష్టికి వచ్చింది. వారు తలుచుకుంటే తెలుగు విద్యార్థిని మరొక భాషకు మార్చవచ్చు. కాని వీరలా చేయలేదు. ఒక్క విద్యార్థి ఉన్నా తప్పక తరగతులు నిర్వహించవలసిందే అని అధికారులను ఆదేశించా డు.
అంతేకాదు, ఆ ఒక్క విద్యార్థికి ద్వితీయ భాషగా తెలుగును బోధించడానికి నన్ను నియమించాడు. నేను రెండు సంవత్సరాలు ఆ ఒక్క విద్యార్థికే తెలుగు పాఠాలు చెప్పాను. డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణుడైన ఆ విద్యార్థి, ‘జెన్‌పాక్’లో ఉద్యోగం చేస్తూనే తర్వాత తెలుగులో ఎం.ఏ చేశాడు.
తెలుగు బోధన
తెలుగును అధికార భాష అన్నవారే గాని ఏనాడూ, దాని అమలుకు చర్యలు తీసుకోలేకపోయాయి ప్రభుత్వాలు. భాష ను బతికిస్తే, సాహిత్యం, సాహిత్యం బతికితే సంస్కృతి బతుకుతుంది కదా! మాతృభాషలో విద్యనభ్యసించాలనుకునే వారెంద రో ఉన్నారు. మాతృభాషలో విద్యాబోధన జరగాలనుకున్నవారూ ఉన్నారు.. కాని అందుకు వ్యవస్థను సిద్ధం చేసేవారే లేరు. నేను ఐటీ ఉద్యోగం చేస్తున్నాను, నాకెందు కు తెలుగు? అని ఆ ఒక్క విద్యార్థి అనుకోలేదు.
ఆ ఒక్క విద్యార్థికి తెలుగు బోధించ డానికి ఒక ఆచార్యుడిని ఎందుకు నియమించాలని ఆచార్య సులేమాన్ సిద్ధికీ అనుకోలేదు వీసీ పదవిలో ఉన్నప్పటికీ. ఆ విద్యార్థి నాకు కనిపించినప్పుడల్లా సిద్ధికీ నా కళ్లముందు ప్రత్యక్షమవుతాడు. వారి తెలుగుభాషాభిమానం నన్ను సంతోషాంతరంగుణ్ణి చేస్తుంది. అధికారంలో ఉన్నవా రు సిద్ధిఖీలాగా వ్యవహరిస్తే తెలుగుభాష కలకాలం జీవిస్తుంది.






