calender_icon.png 22 December, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుర్యా భయ్ ఔట్?

22-12-2025 12:00:00 AM

  1. కెప్టెన్సీ నుంచి తప్పించనున్న బీసీసీఐ 
  2. వరల్డ్‌కప్ తర్వాత కొత్త సారథి
  3. బ్యాటింగ్ ఫెయిల్యూరే కారణం 
  4. కెప్టెన్సీ రేసులో యువ క్రికెటర్లు

* టీ ట్వంటీ జట్టు వైస్ కెప్టెన్‌పై వేటు వేశారు.. ఇక కెప్టెన్‌ను కూడా తప్పించబోతున్నారా ? అంటే అవుననే అనాల్సి వస్తోంది. షార్ట్ ఫార్మాట్‌లో టీమిండియాను లీడ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్‌కు సారథిగా టీ20 ప్రపంచకప్ చివరిది కాబోతోంది. మెగాటోర్నీ తర్వాత సూర్యను కెప్టెన్సీ నుంచి తీసివేయడం దాదాపుగా ఖాయమైంది. వరల్డ్‌కప్‌లో ఫలితం ఎలా ఉన్నా కూడా స్కైని సారథిగా తొలగించడం ఖాయంగానే కనిపిస్తోంది. బ్యాటింగ్ వైఫల్యమే దీనికి కారణం. కెప్టెన్సీ ప్రభావంతో బ్యాటర్‌గా రాణించలేకపోతుండడంతో సూర్యకుమార్ కూడా సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

ముంబై, డిసెంబర్ 21 : టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం ప్రకటించిన జట్టు లో వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ను తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ మెగా టోర్నీ తర్వా త మరో కీలక మార్పుకు సిద్ధమవుతోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను సార థిగా తప్పించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే సెలక్ట ర్లు దీనిపై చర్చించినట్టు తెలుస్తోం ది. కోచ్ గంభీర్‌తో కూడా చర్చిం చి ఒక నిర్ణయానికి రానున్నారు. అయితే ప్రపంచకప్ ముగిసిన తర్వాతే ఆ సమావేశం ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తు తం టెస్ట్ , వన్డే ఫార్మాట్లలో శుభమన్ గిల్ టీమిండియాను నడిపిస్తుండగా.. సూ ర్యకుమార్ యాదవ్ టీ20 ల్లో సారథ్యం వహిస్తున్నాడు. పొట్టి క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాడిగా పేరున ్న సూర్యాభాయ్ కెప్టెన్‌గా అదరగొడుతున్నా, ఆటగాడిగా మాత్రం విఫలమవుతు న్నాడు. ముఖ్యంగా అతని బ్యాటింగ్‌పై కెప్టె న్సీ భారం ప్రభావం పూర్తిగా కనిపిస్తోంది. ఒకప్పుడు టీ 20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ గత ఏడాది కాలంగా అత్యంత పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు.

ఏడాదిగా ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. సారథి కావడంతో అతన్ని టీమ్‌లో నుంచి తీసేయ డం కాస్త ఇబ్బందిగా మారింది. ఎందుకంటే టీ20ల్లో మిస్టర్ 360గా సూర్యకు పేరుంది. ఐపీఎల్‌లో సూపర్ సక్సెస్ అవుతున్న సూర్యకుమార్ టీమిండియా సారథ్య బాధ్యతలు అందుకున్న తర్వాత చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. ఆసీస్ టూర్ లోనూ, ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా సిరీస్ లో సైతం అందరూ ఫామ్ లోకి వచ్చినా సూర్యకుమార్ మాత్రం నిరాశపరుస్తూనే ఉన్నాడు.

సౌతాఫ్రికాతో చివరి టీ20 ముగిసిన తర్వాత తన ఫామ్‌పై తానే సెటైర్లు వేసు కున్న సూర్యకుమార్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు అర్థమవుతోంది. సూర్యకుమార్ ఎక్కడో మి స్ అయ్యాడంటూ వ్యాఖ్యానించాడు. త్వరలోనే అతను బలంగా తిరిగొస్తాడంటూ చెప్పుకొచ్చా డు. తాజాగా మరోసారి కూడా తన పేలవ ఫామ్‌పై స్పందించాడు. తాను రిథమ్ అందుకుంటే ఎవ్వరూ ఆపలేరం టూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం జట్టులో మిగిలిన 14 మంది రాణిస్తూ తనపై ఒత్తిడి లేకుండా చేస్తున్నారం టూ చెబుతున్నాడు.

అయితే కెప్టెన్ ఫామ్‌లో లేకుంటే మాత్రం ఎక్కువరోజులు ఆడించలేరు. మెగాటోర్నీకి ముందు అతన్ని తప్పించడం ఇష్టం లేకనే సూర్యకుమార్‌ను కొనసాగిస్తున్నట్టు సమా చారం.  దీంతో సారథిగా ఈ టోర్నీనే స్కైకు చివరిది కానుంది. తర్వాత ఆటగాడిగా మాత్రమే కొనసాగుతాడు. అదే సమయం లో ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్ సూర్యకుమార్‌కు అత్యంత కీలకం. మెగాటో ర్నీకి ముందు ఫామ్‌లోకి వచ్చేందుకు ఇదే చివరి ఛాన్స్. ఇదిలా ఉంటే  కెప్టెన్‌గా సూర్యకు మంచి రికార్డుంది.

అతని కెప్టెన్సీలో 35 మ్యాచ్ లు ఆడిన టీమిండియా 28 విజయాలు సాధించింది. సూర్యకుమార్ విజ యాల శాతం 84.9 శాతంగా ఉంది. వ్యక్తిగత ఫామ్ కోల్పోవడంతో సూ ర్యను కెప్టెన్‌గా తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పగించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. కొత్త కెప్టెన్ రేసులో అక్షర్ పటేల్, హార్థిక్ పాండ్యా పేర్లు వినిపిస్తున్నాయి. నిజానికి గిల్‌ను టీ20 సారథిగా చేద్దామనుకుని భావిస్తే అతను కూడా పేలవ ఫామ్‌తో ఇప్పుడు టీమ్‌లో ప్లేస్ కూడా కోల్పోయా డు. మొత్తం మీద ప్రపంచకప్ ఫలితం ఎలా ఉన్నా భారత టీ20 జట్టుకు కొత్త సారథి రావడం ఖాయమైంది.