22-12-2025 12:00:00 AM
అడిలైడ్‌లోనూ ఇంగ్లాండ్ చిత్తు
అడిలైడ్, డిసెంబర్ 21 : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండ గానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. సొంతగడ్డపై మరోసారి ఆధిపత్యం నిరూపించుకు న్న కంగారూలు ఆసీస్‌లో యాషెస్ గెలవాలనుకున్న ఇంగ్లాండ్ ఆశలకు తెరదించారు. ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శన కొనసాగిన వేళ అడిలైడ్ వేదికగాజరిగిన మూడో టెస్టులో 82 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
435 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 352 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యా టర్లలో జాక్ క్రాలీ, విల్ జాక్స్, బ్రైడన్ కార్స్, జేమీ స్మిత్ పోరాడినప్పటికి తమ జట్టును ఓ టమి నుంచి గట్టెక్కించలేకపోయారు. రికార్డు లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. ఆరంభంలోనే ఓపెనర్ బెన్ డకెట్, ఒలీ పోప్ ఔటయ్యారు. జో రూట్ కూడా కీలక దశలో ఔటవగా... ఈ మూడు వికెట్లు ఆసీస్ సారథి కమిన్స్ పడగొట్టాడు.
అయితే బ్రూక్ అండతో క్రాలీ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్ర యత్నం చేశాడు. నాలుగో వికెట్ 68 పరుగులు జోడించాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఒక దశలో 177/3 రన్స్ తో పటిష్టంగా కనిపించింది. ఈ దశలో ఆసీస్ స్పిన్నర్ లియో న్ ఆ జట్టును దెబ్బ తీశాడు. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో పోరాడిన కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ సారి చేతులెత్తేశా డు. అయితే చివర్లో జేమీ స్మిత్, విల్ జాక్స్ నిలకడగా ఆడి ఇంగ్లండ్ శిబిరంలో ఆశలు రెకెత్తించారు. స్మిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కార్స్ కూడా ఆకట్టుకున్నాడు. కానీ జాక్స్ ఔటయ్యాక ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది.