calender_icon.png 25 September, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడుంబా నిర్మూలన సాధ్యమేనా?

25-09-2025 01:13:57 AM

-తక్కువ ఖర్చు ఎక్కువ నిషా

-పుష్ప సినిమాను తలపిస్తున్న వైనం

-యువత ప్రాణాలతో చెలగాటం

-స్థావరలపై ఉక్కు పాదం ఎప్పుడోగుడుంబాపై నిఘా కరువు

మంగపేట, సెప్టెంబరు 24(విజయక్రాంతి): మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో నాటుసారా(గుడుంబా) విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు. గుడుంబా తయారీలో నల్ల బెల్లం కరువై చక్కెరతో తయారుచేయడం మొదలుపెట్టారు. కొందరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశతో పుష్ప సినిమా మార్గాన్ని ఎంచుకున్నారు తయారుచేసిన నాటు సారాను గుట్టుచప్పుడు కాకుండా ప్లాస్టిక్ కవర్లలో నింపి రహస్యంగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తూ దందా కొనసాగిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా మద్యం ధరలు విపరీతంగా పెరగడంతో పేద మధ్య తరగతి ప్రజలు ముఖ్యంగా యువత మత్తు కోసం నాటు సారాకు అలవాటు పడుతున్నారు పావుసేరు మందు కొని తాగాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి అదే గుడుంబా అయితే తక్కువ ధరకే దొరుకుతుందని నాటు సారా వైపు మందుబాబులు మొగ్గు చూపుతున్నారు దీంతో పల్లె ప్రాంతాలలో గుడుంబా అమ్మకాలు మరింత జోరుగా కొనసాగుతున్నాయి.

యువత మత్తుకు బానిసై నాటుసారా తాగడం అలవాటు కాస్త వ్యసనంగా మారి రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు పల్లెల్లో చాలా జరిగాయి నిషేధిత గుడుంబాపై ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక నిఘా పెట్టలేకపోతుందనే విమర్శలు వినవస్తున్నాయి ఎక్సైజ్‌శాఖ సంబంధిత అధికారులు నాటుసారా తయారీదారులపై చర్యలు తీసుకోకపోవడం పలు కోణాలలో అనుమానలు మొలకెత్తుతున్నాయి. ఇకనైనాఎక్సైజ్‌శాఖ అధికారులు దష్టి సారించి గుడుంబా తయారీదారులపై ఉక్కు పాదం మోపుతార లేదో అనేది వేచి చూడాలి. గుడుంబా నిర్మూలన సాధ్యమేనా ఆని ఏటూరునాగారం, ఎక్సైజ్‌శాఖ సీఐ రామకష్ణ ను విజయక్రాంతి చరవాణిలో వివరణ కోరగా ఈరోజు మాకు వేలంపాట (వెహికల్ ఆక్షన్) ఉంది మీకు వివరణ తర్వాత ఇస్తాను అని అన్నారు. మళ్లీ వివరణ కోసం ఫోన్ చేయగా బదులు ఏమీ లేదు.