15-10-2025 01:01:39 AM
హైదరాబాద్/ బెంగళూరు, అక్టోబర్ 14: ఏపీలో వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు సంచలనం సృష్టిస్తున్నది. ఈ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో తిరుపతిలోని కార్యాలయంతో సహా హైదరాబాద్, బెంగళూరులోని ఆయన నివాసాల్లో మంగళవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏకకాలంలో దాడులు చేపట్టింది.
హైదరాబాద్‌కు వచ్చిన ఒక బృందం ఫిల్మ్‌నగర్‌లోని ప్రశాసన్‌నగర్, యూసుఫ్‌గూడ గాయత్రీహిల్స్ నివాసాల్లో 3 గంటల పాటు సోదా చేసింది. మద్యం కుంభకోణం కుట్రకు సూత్రధారుడని ఇప్పటికే సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. ముడుపులను కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (ఏ1) వసూలు చేసి ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, బాలాజీ గోవిందప్ప ద్వారా అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి చేరవేసేవారని తెలిపింది. నింది తులంతా కలిసి నెలకు రూ.5,0-60 కోట్ల వర కు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.