calender_icon.png 3 August, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం మత్తులో వాహనం నడిపి వ్యక్తి రిమాండ్‌క

03-08-2025 12:26:17 AM

నిర్మల్,(విజయక్రాంతి): మద్యం సేవించి వాహనం నడుపుతూ ఒక వ్యక్తి మృతికి కారణమైన నిందితుని శనివారం అరెస్టు చేసి రిమాండ్ పంపినట్టు పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయ ఈనెల 15న, వెంకటద్రిపేట్‌కు చెందిన సల్ల అభికేష్ S/o లింగన్న అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి స్కూటీపై స్వగ్రామానికి వెళ్లుతున్న సమయంలో, బంగల్ పేటకు చెందిన బైండ్ల స్వామి @ అవినాష్ అనే వ్యక్తి తన పల్సర్ బైక్‌ను మద్యం మత్తులో నిర్లక్ష్యంగా నడిపి అభికేష్ స్కూటీకి ఎదురుగా ఢీకొట్టాడు.

ఈ ఘటనలో అభికేష్ తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన నిర్మల్ పట్టణ పోలీసులు, నేరస్తుడిని అరెస్టు చేసి ఈరోజు న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు ప్రజలకు పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచిస్తూ.   మద్యం సేవించి వాహనాలు నడిపే ప్రక్రియ చట్టరీత్యా నేరం అని, ఇది ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు