17 April, 2026 | 8:44 PM

సీఎం రేవంత్ చెప్పిన మార్పు ఇదేనా?

12-06-2025 01:27 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): పెట్రోల్ పంపు వాళ్ళు డీజిల్ ఉద్దెరకు పోయడం లేదని, అప్పు పుడుతలేదని, సెక్రటరీలు ట్రాక్టర్ తాళాలను అధికారులకు అప్పగించే పరిస్థితికి సీఎం తీసుకు వచ్చారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హారీశ్ రావు మండిపడ్డారు. ఏడాదిన్నరగా నిధులు ఇవ్వకుంటే గ్రామ పాలన ఎలా సాధ్యమవుతుందన్నారు.

ఈ మేరకు ఆయన బుధవారం ‘ఎక్స్’లో తెలంగాణ సీఎంఓ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ట్యాగ్ చేస్తూ పోస్టు చేశారు. సీఎం రేవంత్ చెప్పిన మార్పు ఇదేనా అని విమర్శించారు. నిధులు లేక గ్రామాల్లో పారిశుధ్యం కుంటుపడిందని, నెల నెలా నిధులు విడుదల చేయకుండా నిర్వహణను గాలికి వదిలేయడంతో గ్రామాలు మురికి కూపాలుగా మారాయన్నారు.