calender_icon.png 24 October, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కలిసిన ఇస్మాయిల్ షంషీ ఖాద్రి

24-10-2025 05:33:49 PM

హనుమకొండ,(విజయక్రాంతి): 59వ డివిజన్ అభివృద్ధి పనుల్లో భాగంగా స్థానిక కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్ రెడ్డితో కలిసి పర్యటించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని అలిపుర ఐవాన్ షాహి మసీదు అధ్యక్షుడు మొహమ్మద్ ఇస్మాయిల్ షంషీ ఖాద్రి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అలిపుర మసీదు ప్రాంతంలో వెనుకబడి, నిరుపేదలుగా ఉన్న ఎనిమిది మంది ముస్లిం మహిళలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే  రాజేందర్ రెడ్డి స్పందిస్తూ రెండవ దఫా ఇందిరమ్మ ఇండ్లలో కచ్చితంగా సర్వే చేయించి, వారికి అర్హత ఉన్నట్లయితే కచ్చితంగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి ముస్లిం మహిళలు స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు.