calender_icon.png 24 October, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేబుల్ టెన్నిస్ పోటీలలో సత్తా చాటిన ఐపీఎస్ పాఠశాల విద్యార్థులు

24-10-2025 05:31:23 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలలో ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్) ఆధ్వర్యంలో  జరిగిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి 14,17 సంవత్సరాల బాలబాలికల టేబుల్ టెన్నిస్ పోటీలలో సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు 14 సంవత్సరాల బాలబాలికల విభాగంలో ఈ వర్షిత గోల్డ్ మెడల్, అభిజ్ఞ శ్రీ బ్రాంజ్ మెడల్, ఏం సంప్రీత్ బ్రాంజ్ మెడల్ సాధించగా,17 సంవత్సరాల బాలబాలికల విభాగంలో జి, సుశాంత్ గోల్డ్ మెడల్, సిహెచ్ ఖుషి సిల్వర్ మెడల్, బి మణికంఠ బ్రాంజ్ మెడల్, ఎండీ అష్రఫ్ బ్రాంజ్ మెడల్ సాధించి సత్తా చాటారు,.మెడల్స్ సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియలు శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ ఆడటం వల్ల విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతుందని, వేగంగా కదిలే బంతికి ప్రతి స్పందించడం వల్ల నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది అని, శారీరకంగా,మానసికంగా దృఢంగా తయారవుతారని అన్నారు.