23 June, 2026 | 1:28 AM

నోటిఫికేషన్లు విడుదల చేయండి

23-06-2026 12:40 AM
  1. లేదంటే రేవంత్‌రెడ్డి ఇంటిన ముట్టడిస్తాం
  2. కాంగ్రెస్ నేతలను బయట తిరగకుండా అడ్డుకుంటాం
  3. నిరుద్యోగ జేఏసీ నేతల హెచ్చరిక
  4. అభ్యర్థులతో కలిసి అశోక్ నగర్ చౌరస్తా వద్ద భారీ ధర్నా
  5. పలువురు నేతల అరెస్టు

ముషీరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో అశో క్ నగర్ చౌరస్తా సిగ్నల్ వద్ద భారీధర్నా నిర్వహించారు. నోటిఫికేషన్లు విడుదల చేయ కుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిన ముట్టడిస్తామని హెచ్చరించారు.

గ్రూప్ లోని ఎంపీ డీవో పోస్టులను పదోన్నతుల ద్వారా కాకుం డా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని, మెగా డీఎస్సీ, ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులను 20వేలతో, గ్రూప్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఖాళీగా ఉన్న జేఎల్‌ఎం పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు వయో పరిమితి పెంచాలని కోరారు.

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలుపుకోవా లని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో లైబ్రరీలో చుట్టూ తిరిగిన కాంగ్రెస్ నాయకులు పదవులు రాగానే పెదాలు మూసుకు పోయాయా? మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయయని అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎంతో కృషి చేసిన నిరుద్యోగులను విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. ప్రైవేట్ హాస్ట ల్ ఫీజులు కట్టలేక, ఇంటికి వెళ్లలేక సతమతమవుతున్నామని ఆవేదనను వ్యక్తం చేశారు.

నోటిఫికేషన్ విడుదల చేయకుంటే సీఎం రేవంత్‌రెడ్డి ముట్టడిస్తామని, కాంగ్రెస్ నేతలను బయట తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా ధర్నా నిర్వహిస్తున్న నిరుద్యోగ జేఏసీ నేతలు పలువురని పోలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేష న్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో రవి కుమార్ శంకర్ నాయక్, సింధూరెడ్డి, వీరేష్, రాము, చందు, ప్రసాద్, అమీన్ తదితరులు ఉన్నారు.