ఎన్యుమరేషన్ ఫారాలు ప్రతి ఇంటికీ అందాలి
కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్, జూన్ 22(విజయ క్రాంతి): బిఎల్‌ఓలు, బిఎల్‌ఎలు ఎన్యూమరేషన్ ఫారా లు ప్రతి ఇంటికి అందించేలా అన్ని పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ మను చౌదరి అన్నారు. సోమవారం కలెక్టరేట్ విసి హాల్ లో ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలు ఇంటింటికి అందించేలా చూడాలని తెలిపారు. ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయ్యేందుకు బిఎల్‌ఓలకు, బిఎల్‌ఎలకు శిక్షణ అందించడం జరుగు తుందన్నారు.
ఎలక్టరోల్ లిస్టు లోమ్యాపింగ్ కాని ఓటర్లు 1987 ముందుగా జన్మించిన వారు గుర్తింపు (ఎస్‌ఎస్సి, ఇంటర్ మేము, క్యాస్ట్ సర్టిఫికెట్) 1987 నుండి 2004 మధ్య జన్మించిన వారు తల్లి/తండ్రిది గుర్తింపు, 2004 తరువాత జన్మించిన వారు తల్లి, తండ్రులు ఇద్దరి గుర్తింపు కాపీలు జత చేసి బిఎల్‌ఓలు, బిఎల్‌ఎలు ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకోవాలని, మ్యాపింగ్ అయిన వాళ్లు సంతకం చేసి ఇస్తే చాలాని కలెక్టర్ వివరించారు.
రెండు చోట్ల డబుల్ ఎన్రోల్ మెంట్ ఉన్న ఓట్లర్ల నోటీసులు జారీ చేసి, వారి అభ్యర్థన మేరకు ఒకచోట మాత్రమే ఉండేలా చూడాలన్నారు. ప్రతిరోజు సుమారు 30 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయాలని, ఫారాలు పూర్తి చేసి అందించేందుకు ఒక వారం గడువు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






