23 June, 2026 | 3:06 AM

గోదావరి క్షేత్రం.. ప్రమాదాలకు నిలయం

23-06-2026 01:22 AM

బాసర గోదావరి వద్ద పేరుకుపోయిన చెత్త 

రక్షణ చర్యలు శూన్యమే 

నిర్మల్ జూన్ 22 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి బాసర అమ్మవారి సన్నిధిలో గోదావరి క్షేత్రం అపశుభ్రతకు నిలయంగా మారింది. దేశ నలుమూల నుండి ప్రతిరోజు వందలాది మంది భక్తులు వచ్చి పుణ్య స్థానాలు చేసే పుష్కర ఘాట్ ల వద్ద కనీస సౌకర్యాలు లేవు.

పుష్కర ఘాట్ ల వద్ద రక్షణ చర్యలు లేకపోగా జల్లుల స్నానాలు ఆచరించే భక్తుల నీటితో పుష్కర ఘాట్ల మెట్లపై పారడంతో అవి నాచు ఏర్పడి భక్తులు జారీ పడుతున్నట్టు చెప్తున్నారు. గో దావరి నదీ పరివాహక ప్రాంతమంతా చెత్తాచెదారం ప్లాస్టిక్ వస్తువులు కొబ్బరి ముక్కలు కూలిన పదార్థాలు వేరుకపోవడంతో దుర్వాసన ఏర్పడి భక్తులు స్నానానికి ఇష్టపడడం లేదు. ప్రతిరోజు వచ్చే భక్తులు అక్కడి సదుపాయం చూసి ముక్కున వేలేసు కుంటున్నారు 

కనీస చర్యలు కరువు 

దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిలయమైన బాసర గోదావరి భక్తులకు ప్రమాదకటికలను సూచిస్తుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు మొదటగా బాసర వద్ద మొదటి రెండవ మూడో పుష్కర ఘాట్ల వద్ద పుణ్య స్థానాలు చేస్తారు. పుష్కర గట్ల వద్ద నీటి ప్రవాహం అంచుల చెత్తాచెదారం నిండుకొని ఉంది వాటిని కనీసం తొలగించడం లేదు.

మెట్లపై బురద ఏర్పడడంతో భక్తులు స్నానానికి వెళ్లి కాలుజారి గోదావరి పడి వృత్తివత చెందుతున్నారు. పుష్కర ఘాట్ ల వద్ద ఎలాంటి హెచ్చరికలు లేవు. పుష్కర్ ఘాట్ అడుగుభాగం లో ఇనుప సంఖ్యలతో కూడిన రక్షణ లేకపోవడంతో నీటి లోతు తెలియక లోనికి వెళ్లిన భక్తులు నూట మునిగి చనిపోతున్నారు. జల్లుల కోసం పైప్ లైన్లు ఏర్పరిచేసిన స్నానం చేసిన నీళ్లు తిరిగి మెట్ల ద్వారా గోదావరిలోకి వెళ్లి క్రింద స్థానం చేసే భక్తులకు అపవిత్రతను చాటుతున్నాయి.

రాత్రి సమయంలో కనీస విద్యుత్ బల్బులు కూడా వెలగడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితం హైదరాబాద్ చెందిన ఆరుగురు యువకులు మృత్యువాత పడగా ఇటీవలే హైదరాబాద్ చెందిన ముగ్గురు అన్నదమ్ములు గోదావరిలో మునిగి చనిపోయిన సంగతి తెలిసింది. అయినప్పటికీ అధికారులు అక్కడ కనీస చర్యలు చేపట్టకపోవడం పై భక్తులు మండిపడుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు స్పందిస్తున్న అధికారులు తాత్కాలిక చర్యలతో వాటిని నిర్లక్ష్యం చేయడంతో పదేపదే ప్రమాద ఘటికలు సంభవించి భక్తుల ప్రాణాలకు రక్షణ కరువవుతుంది. 

బాసర ఆలయానికి ఆదాయం ఉన్న అక్కడ సౌకర్యాలు లేకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు తక్షణ స్పందించి బాసర గోదావరి వద్ద పరిశుభ్రత చెత్తాచెదారం తొలగించి భక్తులకు ప్రమాదాలు జరగకుండా కనీస చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.