పెబ్బేరు సంతపై ఈగవాలనివ్వకుండా చూసుకునే బాధ్యత నాది
దోచేయాలని చూసిన దొంగలే నేడు నీతిమంతులుగా మాట్లాడడం విడ్డూరం
పెబ్బేరు సంత వివాదం దేవాదాయ శాఖకు పూజారులకు మధ్య నడుస్తోంది
కోర్టును గౌరవిస్తూ ఎవరికి అన్యాయం చేయకూడదు అన్న ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం
తప్పులు చేసి నీతులు మాట్లాడే పాలకుండా కాడి దొంగ పిల్లలు మాటలు నమ్మకండి: ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, మార్చి 22 (విజయక్రాంతి): వనపర్తి చరిత్రలో సురవరం నుంచి మొదలు పెడితే చివరిగా చిన్నారెడ్డి వరకు ఎమ్మెల్యేలంతా తులసి మొక్కలుగా పూజింపబడితే పదేళ్ల నియంత పాలన చేసిన ఒకే ఒక్కడు మాత్రం గంజాయి మొక్కల తయారయ్యాడని అలాంటి గంజాయి మొక్కను పీకి అవతల పడేయాలని వనపర్తిని కాపాడుకుందాం వనపర్తిని మార్చుకుందామని 2023 లో జరిగిన ఎన్నికల్లో ప్రజలను కోరితే పీకి అవతల పరేశారని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.
ఆదివారం వనపర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తామెప్పుడు ఎవరిని అగౌరపరిచే విధంగా మాట్లాడలేదని కొందరు వెధవలకు వాళ్ళ భాషలోనే చెబితేనే అర్థం అయ్యేటట్లు ఉందని నేడు ఈ విధంగా మాట్లాడవలసి వస్తుందని ఆయన అన్నారు. పెబ్బేరు సంత స్థలంలో పూజారుల తరఫున న్యాయవాదిని తానేనని ఒప్పుకోవడం జరిగిందన్నారు.
100 సంవత్సరాలుగా వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించిన ఈనామ్ భూమి అది అని అందరికీ తెలుసునని అప్పటినుంచి ఇప్పటివరకు సంత ప్రశాంతంగా కొనసాగిందన్నారు. 1973 లో ఒక ప్రొసీడింగ్ వచ్చిందని 392 సర్వే నెంబర్లు 15 ఎకరాలు, సర్వేనెంబర్ 405 లో 15 ఎకరాల భూమి మొత్తం 30 ఎకరాల 19 గుంటలు వేణుగోపాల స్వామి దేవుడిపై ఆయన దూపదీప నైవేద్యాల కోసం కేటాయించబడి ఉన్నదని ఆ గుడి ద్వారా వచ్చే ఆదాయంతో పూజారులు వాళ్ళ జీవనాన్ని కొనసాగించేందుకు కేటాయించారు అని చెప్పారు.
తదంతరం వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించిన రిజిస్టర్లలోని కాస్ర పహానిలో దేవుడు వేణుగోపాల స్వామిని మనిషి వేణుగోపాలస్వామిగా చిత్రీకరించి రాశారని అది చేసిన ఎవరు చేసిండ్రు ప్రజలకు అర్థమైపోతుందన్నారు. 100 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న ఆ సంతస్థలం ఈ గంజాయి మొక్క కు ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ పదవి రాగానే వివాదాస్పదంగా మార్చారని ఆయన పేర్కొన్నారు.
ఈయన అధికారంలో ఉన్న సమయంలోనే వారసులొచ్చారు, దేవదాయ శాఖకు సరెండర్ చేస్తారు ఇంకోటి ఇంకోటి వాళ్ళ ఇష్టానుసారంగా చేసిన విషయాలన్నీ పెబ్బేరు ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. ఆలయ పూజారుల అడ్వకేటునైన నేనే ఈ సమస్యను పరిష్కరిస్తానని 12 నుంచి 15 ఎకరాలలో సంతకు సరిపోతుందని మిగతాది పూజారుల పేరు మీద చేద్దామని ఒక ప్లాన్ ప్రకారంగా ఆ స్థలాన్ని దొబ్బేచ్చేందుకు వ్యూహాలు రచించారన్నారు.
ఈ క్రమంలో గిఫ్ట్ డిడి కింద రిజిస్ట్రేషన్ చేసేది ఉంటే అది పెబ్బేరు మున్సిపల్ పేరున చేయాల్సి ఉంటుంది కానీ ఆయన అలా చేయలేదు మళ్లీ నేనే గెలుస్తానని, అప్పుడు ఈ స్థలాన్ని దొబ్బియొచ్చని పెబ్బేరు ఎమ్మార్వో పై రిజిస్ట్రేషన్ చేయించారని ఈ క్రమంలో పూజారులకు గిఫ్ట్ డిడి కింద మండల పరిధిలో ఎక్కడైనా దానికి సరితూగే స్థలాన్ని సూచించాలన్నదే దాని ఉద్దేశంమన్నారు.ఎన్నికల సమయంలో తాము చెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు.
ఇదిలా నడుస్తుండగానే ఎమ్మెల్యేగా తానే పూజార్ల వద్దకు వెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నిద్దామని వెళ్లే క్రమంలో ఈ పాలకాడి పిల్లి ఆయన పూజారి తరుపు అడ్వకేట్ గారు ఎమ్మెల్యే గారికి సహకరించొద్దని, మెసేజ్లు పెట్టిన దరిద్రుడు సంతపై మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. మెసేజ్లు పెట్టలేదని తడి బట్టలతో వేణుగోపాల స్వామి గుడిలోకి వచ్చి ప్రమాణం చేయాలని నేనైనా వస్తారని ఎమ్మెల్యే సవాలు విసిరారు. నా దగ్గర డీజిల్ కి కూడా డబ్బులు లేవు ఇవ్వండి మేఘ రెడ్డి అని అన్న రోజు నుండి ఈరోజు వరకు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఇకపై ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ప్రతిది బయట పెట్టాల్సి వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, టీపీసీసీ జర్నల్ సెక్రెటరీ నందిమల్ల యాదయ్య, తిరుపతయ్య, పీసీసీ సభ్యులు శంకర్ ప్రసాద్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




