23 March, 2026 | 3:14 AM

శునకానికి వెన్నెముక సర్జరీ

23-03-2026 12:00 AM

కోదాడ, మార్చి 22 :  కోదాడ ప్రాంతీయ వైద్యశాలలో ఆదివారం శునకానికి విజయవంతంగా వెన్నెముక సర్జరీ నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ డా.పి.పెంటయ్య  మాట్లాడుతూ నందిగామకు చెందిన జంతు ప్రేమికుడు శామ్యూల్ పెంపుడు శునకానికి యాక్సిడెంట్ లో గాయాలపాలవ్వగా యజమాని వైద్యం కోసం కోదాడ ప్రాంతీయ వైద్యశాలకు తీసుకొచ్చినట్లు వివరించారు.

అసిస్టెంట్ డైరెక్టర్ డా.పి.పెంటయ్య  ఆధ్వర్యంలో కుక్కకు పరీక్షలు చేయగా వెన్నెముక దెబ్బతిన్నట్లు, సర్జరీ అవసరమని గుర్తించారు. ఎంతో క్లిష్టమైన వెన్నెముక సర్జరీ కోసం పలు ప్రాంతాల్లోని వైద్యులు మేళ్ళచెర్వు కిరణ్ , రాధాకృష్ణ  రవి, చంద్రమోహన్, జనార్ధన్ తదితరులు సహాయ సహకారాలు అందించగా డాక్టర్ పెంటయ్య విజయవంతంగా చికిత్స పూర్తిచేశారు. విషయ తెలుసుకున్న అడిషనల్ డైరెక్టర్ బి ఎస్ రాయుడు ప్రత్యేకంగా ఫోన్ ద్వారా పెంటయ్యను అభినందించారు. శస్త్ర చికిత్స లో  కట్టకోమ్ముగుడెం పశువైద్యాదికారి బి.శ్రీనివాస్, సిబ్బంది రాజు, చంద్రకళ, రాజేష్  పాల్గొనారు.