10-12-2025 12:01:54 AM
చేగుంట, డిసెంబర్ 9 : స్థానిక ఎన్నికల సందర్భంగా స్టేజ్ 2 అధికారులకు శిక్షణ నిర్వహించినట్లు చేగుంట ఎంపీడీవో చిన్నారెడ్డి తెలిపారు. మండలంలో రెండో విడత ఎన్నికలు ఉన్నందున తమకు కేటాయించిన గ్రామాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి మండల పరిధిలోని మైనంపల్లి ఫంక్షన్ హాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నీరజ, మండల అధికారులు, ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.