calender_icon.png 23 January, 2026 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ నియమాలను పాటించడం మనందరి బాధ్యత

23-01-2026 12:00:00 AM

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 22, (విజయక్రాంతి): ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతు బజార్ వద్ద రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతిష్టాత్మకంగా పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన ఎరైవ్ .. ఎలైవ్  అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పట్టణ స్థానికులు, వ్యాపారస్తులు, ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను పాటించటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రత్యేక రోడ్డు ప్రమాదాలకు గురై చాలామంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు.

రోడ్డు ప్రమాదాలను నివారించడంలో పోలీసు వారు తీసుకునే చర్యలకు ప్రజలందరూ సహకరించాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో భాగంగానే నిత్యం పోలీసులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించే విధంగా విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించి ప్రయాణించటం వలన ప్రాణాలను కాపాడుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంతో ప్రతిష్టాత్మకంగా కేవలం రోడ్డు ప్రమాదాలను అరికట్టడం కోసం పోలీసులు శ్రమించడం హర్షనీయమని కొనియాడారు. ప్రజల భద్రత, సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్న పోలీస్ శాఖకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం టూ టౌన్ సిఐ ప్రతాప్, 3టౌన్ సీఐ శివప్రసాద్, లక్ష్మిదేవిపల్లి ఎస్త్స్ర రమణారెడ్డి, ట్రాఫిక్ ఎస్త్స్ర ప్రవీణ్, ఎస్త్స్ర విజయ కుమారి, తదితరులు పాల్గొన్నారు.