calender_icon.png 11 September, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరత్వం దిశగా!

06-09-2025 12:00:00 AM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య అమరత్వం గురించి చర్చకు రావడం ఆసక్తిని రేపుతున్నది. షాంఘై సదస్సు సందర్భంగా బీజింగ్‌లో నిర్వహించిన మిలిటరీ కవాతు సందర్భంగా భేటీ అయిన ఈ ఇద్దరు అవయవాల మార్పిడి అంశంపై హా ట్ మైక్‌లో చర్చించుకున్నట్లు తెలుస్తోంది. పుతిన్ మాట్లాడిన విషయాలను ఆయన అనువాదకుడు మాండరిన్ భాషలో జిన్‌పింగ్‌కు వివరించడం గమనార్హం.

‘ఇటీవలే మానవ అవయవాల మార్పిడి పదేపదే జరుగుతోంది. దీనివల్ల వయసు మీద పడుతున్నప్పటికీ యవ్వనవంతులుగానే కనిపిస్తున్నారు. బహుశా వృద్ధాప్యాన్ని దూరం చేసి అమరత్వం సాధించేందుకు అవయవాల మార్పిడి ఉపయోగపడుతుందేమో’ అని పుతిన్  వివరించారు. అయితే ఈ విషయాలేవి బయటికి రాకుండా వారిద్దరు చిరునవ్వుతో ఏదో సరదా సంభాషణ జరుగుతున్నట్లుగా నటించారు.

కానీ సామాజిక మాధ్యమం పుణ్యమా అని వీరి మాటలు బయటకు రావడం గమనార్హం. ప్రస్తుతం పుతిన్, జిన్‌పింగ్‌ల వయస్సు 72 ఏళ్లు. ఈ ఇద్దరు తమ దేశాలకు శాశ్వత అధ్యక్షులుగా ఉండాలని తాపత్రయపడేవాళ్లే. తన అధికారం నిలబెట్టుకోవడం కోసం పుతిన్ 2036 వరకు, అంటే అతనికి 83 సంవత్సరాలు వచ్చే వరకు రష్యాకు అధ్యక్షుడిగా ఉండేలా రాజ్యాంగాన్ని మార్చేయడం గమనార్హం.

మరోవైపు జిన్‌పింగ్ కూడా 2018లోనే చైనా అధ్యక్ష పదవికి కాలపరిమితి తొలగించి బతికున్నంత వరకు తానే అధ్యక్షుడిగా ఉండేలా వీలు కల్పించుకున్నారు. బతికినంత కాలం తామే అధ్యక్షులుగా కొనసాగాలని భావించిన వీళ్లు అమరత్వం గు రించి మాట్లాడుకోవడం పెద్ద విషయమే కాదు. మరి అవయవ మార్పిడి తో అమరత్వం సాధ్యమేనా అన్న విషయం ఆరా తీస్తే.. అవయవ మార్పిడి ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయి.

ఎన్‌హెచ్‌ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రకారం.. గత 30 సంవత్సరాల్లో ఒక్క యూకేలోనే అవయవ మార్పిడి ద్వారా లక్ష మంది ప్రాణాలను రక్షించినట్టు తె లుస్తోంది.జర్నల్ ఆఫ్ మెడికల్ ఎకనామిక్స్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం మూత్రపిండాల సగటు ఆయుర్దాయం 15 నుంచి 20 సంవత్సరాలు, కాలేయం 20 సంవత్సరాలు, గుండె 15 సంవత్సరాలు, ఊ పిరితిత్తులు 10 సంవత్సరాలు అని తేలింది.

పుతిన్, జిన్ పింగ్‌లు కూడా బహుశా బహుళావయాల మార్పిడి గురించే మాట్లాడుకొని ఉంటారు. చివరగా ఇదే సైనిక కవాతు ప్రదర్శనలో ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు. అయితే పుతిన్ భేటీ అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ఆశ్చర్యపరిచాయి.కిమ్ వెళ్లిపోగానే.. వారు కూ ర్చున్న ప్రదేశం వద్దకు ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కిమ్ కూర్చున్న కుర్చీని అదే పనిగా శుభ్రం చేస్తే, మరొకరు ఆయన వాడిన గ్లాస్‌ను జాగ్రత్తగా తీసుకెళ్లిపోయాడు.

కిమ్‌కు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు ఆ ప్రాంతంలో లే కుండా, ఆయన డీఎన్‌ఏ ఎవరికీ చిక్కకుండా ఇలా వ్యవహరించి ఉ ంటారు. గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్‌తో భేటీ అయిన అనంతరం ఇలాంటి జాగ్రత్తలే తీసుకున్నారని సమాచారం.

ఆయన మలాన్ని తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా ఒక సూట్‌కేసుతో బాడీగార్డులు రావడం గ మనార్హం. తమ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బయటపడ కుండా ఉండేందుకే ప్రపంచ నేతలు ఇలా జాగ్రత్తలు పాటిస్తున్నారేమో!