23-02-2025 12:00:00 AM
మనదేశంలో చాలామంది ఊబకాయం లాంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) గుర్తించింది. దీనికి కారణం ఏమిటంటే అనారోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తింటున్నట్టు తేలింది. అయితే ఒకప్పుడు భారతీయులు పప్పులు, పండ్లు, కూరగాయలు లాంటివి ఎక్కువగా తినేవారు.
కానీ ప్రస్తుతం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదని అంటోంది ఎయిమ్స్. భారతీయులు తినకూడని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారని, దీనివల్ల తీవ్రమైన వ్యాధుల ప్రమాదం పెరిగిపోతోందని తేల్చి చెప్పారు డాక్టర్లు. భారతదేశంలో 56 శాతం వ్యాధులు అనారోగ్యకరమైన ఆహారంతో ముడిపడి ఉన్నాయి. అయితే ఆరోగ్యకరమైన పదార్థాల బదులు జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం పెరిగిపోతున్నట్టు గుర్తించారు వైద్యులు.