3 July, 2026 | 8:28 AM

ఆ మచ్చలు దూరం..

23-02-2025 12:00 AM

తేనె వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయన్న విషయం తెలిసిందే. ఆరోగ్యానికే కాదు.. సౌందర్య పరిరక్షణలోనూ తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి అదెలాగో తెలుసుకుందాం..

* కాలిన గాయాల పైన తేనెను పూయడం వల్ల మచ్చలు పడవు.

* మొటిమల మీద తేనెను రాయడం వల్ల అవి త్వరగా తగ్గుతాయి.

* తేనె రాయడం వల్ల మొటిమల మచ్చలు చర్మపు రంగులో కలిసిపోతాయి.

* తేనె పూయడం వల్ల పెదాలు పొడిబారకుండా ఉంటాయి.

* తేనె చర్మకాంతిని పెంచడమే కాకుండా చర్మంలో తేమ ఉండేలా చేసి మృదువుగా మారుస్తుంది. అంటే చక్కటి మాయిశ్చరైజర్‌గా                                    ఉపయోగపడుతుంది.