calender_icon.png 2 August, 2025 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పష్టత ఇస్తే బాగుండేది!

01-08-2025 12:00:00 AM

  1. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే ఏం చేస్తరు
  2. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. అయితే స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే ఏంటనేది అర్థం కావడం లేదని, ఈ విషయంలో కోర్టు క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మీడియాతో గు రువారం మాట్లాడారు.

స్పీకర్ నిర్ణయం తీ సుకోవాలని ఆశించడం వేరు.. శాసించడం వేరని, ఈ సున్నితమైన విషయంలో తేడాతో పార్టీలు మారుతున్నారని అన్నారు. 10 మం ది ఫిరాయింపు ఎమ్మెల్యేల జడ్జిమెంట్‌లో స్పీకర్‌కు నిర్ణీత సమయం పెట్టారని, ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ కోర్టుకు వెళ్లాల్సిందేనా అని సందేహం వ్యక్తం చేశా రు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఒక నాణెనికి ఉన్న బొమ్మ, బొరుసు లాంటివని విమర్శించారు. 

హిందువులను టెర్రరిస్టులుగా చిత్రికరించే ప్రయత్నం

2008 యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ కొత్త చరిత్ర సృష్టించే ప్రయత్నం చేసిందని, మన్మోహన్ సింగ్, సోనియాల ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడిందని ఆయన విమర్శించారు. మాలేగావ్ కోర్టు స్పష్టమైనన తీర్పు ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు.. కాంగ్రెస్ నేతలు హిందువులను ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు.