03-07-2025 12:09:24 AM
బిగ్‌బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతమ్‌కృష్ణ హీరోగా, రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరో యిన్లుగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందించిన తాజాచిత్రం ‘సోలోబాయ్’. నవీన్‌కుమార్ దర్శకత్వంలో సతీశ్ నిర్మించిన ఈ సినిమా జులై 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వీవీ వినాయక్ ముఖ్యఅతిథిగా, మరికొందరు అతిథులుగా హాజరయ్యారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ.. “నిర్మాత సతీశ్ చాలా సాధా రణ స్థాయి నుంచి వచ్చి ఇండస్ట్రీలో రాణించడానికి ఎంతో కష్టపడ్డారు.
ఈ సినిమా మంచి విజయం సాధించాలి” అన్నారు. హీరో గౌతమ్‌కృష్ణ మాట్లాడుతూ.. “పరిశ్రమలో ఎలాంటి పరిచయాలు లేకుండా వచ్చి ఇలా ఒక సినిమాలో హీరోలా నిలబడటం చాలా పెద్ద విషయం. దాన్ని సక్సెస్‌లా చూస్తున్నా. నన్ను ప్రశ్నించే వారికి ఇదేనా సమాధానం” అన్నారు. ‘సినిమా అందరికీ నచ్చుతుంద’ని రమ్య పసుపులేటి అన్నారు. ‘ఈ టీమ్ అంద రితో పనిచేయడంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాన’ని శ్వేత అవస్తి చెప్పారు.