03-07-2025 12:07:09 AM
విజయ్ ఆంటోని నటిస్తూ నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో తన మేనల్లుడు అజయ్ ధీషన్‌ను విజయ్ ఆంటోని తెరకు పరిచయం చేశారు. జూన్ 27న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ఉంది. మూవీ యూనిట్ బుధవారం హైదరాబాద్‌లో థాంక్స్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. “అజయ్‌ను ఇంత బాగా లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అజ య్‌తో కలిసి నేను ఇక స్ట్రెయిట్ తెలుగు సినిమాల్ని నిర్మిస్తా.
తమి ళంలో ప్రస్తుతం ఏడు చిత్రాల్ని చేస్తు న్నా. అందులో తెలుగు డబ్బింగ్ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటా. త్వరలోనే ‘భద్రకాళి’ రానుంది. అదొక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్” అన్నారు. ‘ఈ సినిమాకు తెలుగులో ఇంత సక్సె స్ వస్తుందని అనుకోలేద’ని అజయ్ ధీషన్ తెలిపారు. ‘ఇది హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో భారీ ఎత్తున నిర్మించిన చిత్రం” అని లియోజాన్‌పాల్ చెప్పారు. “మార్గన్’ను ఆడియెన్స్ ఫస్ట్ నుంచి లా స్ట్ వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఫీల్ అయ్యారు” అని భాష్యశ్రీ తెలిపారు.