calender_icon.png 19 December, 2025 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ జిల్లాలో నువ్వా..నేనా!

19-12-2025 01:17:46 AM

  1. సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్

ఖానాపూర్‌లో మాత్రమే బీఆర్‌ఎస్ ప్రభావం

స్వతంత్రులపై పార్టీ నేతల కన్ను

నిర్మల్, డిసెంబర్ 1౮ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల ఘట్టం ముగిసింది. ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష విఆర్‌ఎస్ బిజెపి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రాజకీయ చైతన్యం ఉన్న నిర్మల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు అందరు చివరి క్షణం వరకు విశ్వ ప్రయత్నాలు చేసి గెలిపి లక్ష్యంగా మార్గ నిర్దేశం చేశారు.

నిర్మల్ జిల్లాలో నిర్మల్ ఖానాపూర్ ముధోల్ నియోజకవర్గం ఉండగా 18 మండలాల్లో 400 గ్రామపంచాయతీలకు ఎన్నికలు మూడు విడుదలగా అధికారులు పూర్తి చేశారు. ఎన్నికలను అధికార పార్టీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు వేడుమ బుజ్జి పటేల్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి నారాయణరావు పటేల్ రేఖా శ్యాం నాయక్ శ్రీహరి రావు ప్రతిష్టాత్మకంగా నిలిచాయి.

బిజెపి నుంచి ఆ పార్టీ బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ప్రతిష్టాత్మంగా తీసుకోగా టిఆర్‌ఎస్ నుంచి ఆ పార్టీ నాయకులు రామ్ కిషన్ రెడ్డి ఖానాపూర్ నుంచి జాన్సన్ నాయక్ ముధోల్ నుంచి కిరణ్ కారే రమాదేవి మూలం శ్యాంసుందర్ తదితర అగ్ర నేతలు ఆయా మండలాల్లో సర్పంచ్ ఎన్నికల్లో తమ మద్దతు ధరలను గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు సాగించారు

రాజకీయ చైతన్యానికి ప్రతీక ఫలితాలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రాజకీయ చైతన్యం ఉన్న నిర్మల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా వచ్చాయి. మొత్తం 400 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ బిజెపిల మద్దతు ధరల మధ్య పోటీ నువ్వాన్నైనా అనే రీతిలో కొనసాగింది. ముధోల్ నిర్మల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బిజెపి మధ్య పోటీ ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టిఆర్‌ఎస్ మధ్య పోటీ ఉన్నట్టు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

జిల్లా వ్యాప్తంగా మూడు విడుదలగా జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి 161 సీట్లు రాగా బిజెపికి 146 సీట్లు బిఆర్‌ఎస్కు కేవలం 26 స్వతంత్ర అభ్యర్థులు 78 చోట్ల విజయం సాధించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు కావడం పార్టీ రైత గుర్తులు ఉండడంతో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిపొందిన వారిలో చివరి వరకు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు చివరి నిమిషంలో మద్దతు లభించకపోవడంతో రెబల్స్గా దిగి విజయం సాధించినవారు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.

తిరిగి వారిని పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ నేతలు మంతనాలు సాగిస్తున్నారు త్వరలో ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో సర్పంచ్లను ఎక్కువగా తమ పార్టీలో చేర్చుకుంటే ఆ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించుకోవచ్చని భావిస్తున్న పార్టీ నేతలు స్వతంత్ర సర్పంచులకు గాలం వేస్తూ పార్టీ లోకి రావాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.

స్వసంత్ర అభ్యర్థులు ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి జిల్లాలో సర్పంచుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో ఆదిపత్యం కోసం రెండు పార్టీల నేతలు కష్టపడుతున్నారు. ఇక ఖానాపూర్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ కొంత ప్రభావం చూపిన నియోజకవర్గాల్లో అంత ప్రభావం చూపకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆత్మ విమర్శ చేసు కుంటున్నారు.

ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు

నిర్మల్ జిల్లాలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. జిల్లాలో 170 స్థానాలకు పైగా గెలుపుకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం. టిఆర్‌ఎస్ బిజెపి నేతలు కాంగ్రెస్ పార్టీపై అసత్యపు ప్రచారం చేసిన ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపడంతో ప్రజలకు మంచి పాలన అందిస్తాం.

 వేడుమ బుజ్జి పటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు

ప్రభుత్వంపై విశ్వాసం పోయింది

నిర్మల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వం పోరాడిన ప్రజలు మాత్రం మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ బిజెపి మద్దతు ధరలను గెలిపించుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ఆరు గ్యారంటీలు 120 హామీలు తుంగలో తొక్కిందని పేర్కొన్నారు దీన్ని ప్రజల్లో సర్పంచ్ అభ్యర్థులు బలంగా చెప్పడం వలన 150 సర్పంచులు విజయం సాధించారని తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో అత్యధిక బిజెపి సర్పంచులు గెలిచారన్నారు.

మహేశ్వర్‌రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే

ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతాం

నిర్మల్ జిల్లాలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత కనిపించింది  ప్రభుత్వాలు ఏర్పడి రెండేళ్లు గడి చిన ప్రజలకు ఏం ఉపయోగపడలేదు. గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది కొత్త పథకాలపై ధ్యాస లేదు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రజలతో కలిసి కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం పంచాయతీ ఎన్నికల్లో ఖానాపూర్ లో మాత్రమే కొంత ప్రభావం ఉన్న మిగతా నియోజకవర్గం గట్టి పోటీని ఇచ్చాం.

 జాన్సన్ నాయక్, బీఆర్‌ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్