calender_icon.png 4 September, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఎస్ వెంటనే రద్దు చేయాలి

01-09-2025 11:02:14 PM

ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్

వడ్డేపల్లి,(విజయక్రాంతి): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్) ను వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలని హనుమకొండ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తొలుత అంబేద్కర్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ ఆకుల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానం వల్ల గత 20 ఏళ్లుగా ఉద్యోగులు ఎంతో నష్టపోతున్నారని అన్నారు.