calender_icon.png 4 September, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాన రాజకీయ పార్టీలు పార్టీ అధ్యక్షులుగా బీసీలకు అవకాశం కల్పించాలి..

04-09-2025 06:24:35 PM

బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్..

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీలు అధ్యక్షులుగా బీసీలకు అవకాశం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్(District Chief Secretary Doggali Sridhar) ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీ అగ్రవర్ణాలకే పార్టీ అధ్యక్ష స్థానాలను కేటాయించాయని, కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అధ్యక్ష స్థానాన్ని కేటాయించిందని పేర్కొన్నారు. రాబోయే పార్టీ అధ్యక్ష స్థానంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు బీసీలకే అధ్యక్ష స్థానాన్ని ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ బీసీ రిజర్వేషన్లను 42 శాతం స్థానిక సంస్థలలో ఇవ్వడం దానికి అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ పంపడం, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా బీసీలకే అవకాశం ఇచ్చి బీసీల కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా ఉండాలని కోరారు.