calender_icon.png 7 September, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగులోనిగుట్టను రెండో తిరుపతిగా అభివృద్ధి చేస్తా

02-09-2025 12:00:00 AM

రూ.1.60 కోట్లతో పనులు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

రేగొండ సెప్టెంబర్ 1(విజయ క్రాంతి): మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో వెలసిన బుగులోని గుట్టను రెండో తిరుపతిగా అభివృద్ధి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారయణ రావు అన్నారు.సోమవారం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే రూ.1.60 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.కోరిన కోరికలు తీర్చి భక్తుల బుగులు పోగొట్టే శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర ను రెండో తిరుపతిగా తీర్చిదిద్దడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.

ప్రకృతి ఒడిలో అద్భుతమైన కొండల నడుమ స్వయంభు గా వెలిసి భక్తుల కష్టాలు తీర్చే ఆపద్బాంధవుడి లా  మారిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మన జిల్లాలో కొలువై ఉండడం మన అదృష్టమన్నారు.నవంబర్ మాసంలో కార్తీక పౌర్ణమికి 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి రావడం స్వామి వారి దర్శనం కోసం భక్తులు కొండ పైకి ఎక్కడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం నేను చూశాను.

గత పాలకుల నిర్లక్ష్యంతో జాతర అభివృద్ధిలో వెనుకబడింది. ఎమ్మెల్యేగా గెలిస్తే అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చా దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేగా  జాతరకు ప్రభుత్వ సహకారంతో పనులు తీసుకువచ్చానన్నారు. జాతరలో రూ.1.60 కోట్ల తో కొండపైకి ఎక్కే మెట్ల ప్రాంగణాన్ని వెడల్పు,నీటి కొలను వెడల్పు,మంచి నీటి బావి ని వెడల్పు చేయడం అలాగే వచ్చే జాతరకు మరో రూ.2 కోట్ల నిధులు తీసుకువచ్చి స్వామి వారికి కళ్యాణ మండపం, భక్తుల విశ్రాంత గది,శివాలయం అభివృద్ధి పనులకు శ్రీకారం చేపడుతానన్నారు.

అలాగే గతంలో రూ.5.70 కోట్లతో పాండవుల గుట్ట,బుగులోని గుట్ట, జగ్గయ్యపేట, తిరుమలగిరి,లను కలుపుతూ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశానని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనుల్లో జాప్యం జరిగిందన్నారు. త్వరలోనే అన్ని పనులు పూర్తిచేసి జాతరలో భక్తులకు  ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. పాండవుల గుట్ట,బుగులోని జాతర కొండలు, మైలారం గుహలు, రామప్ప, కోట గుళ్ళు ను ఎకో టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో డీ ఎఫ్ ఓ నవీన్ రెడ్డి, అధనపు కలెక్టర్ విజయలక్ష్మి, కన్జర్వేటర్ ప్రభాకర్, స్థానిక ఎమ్మార్వో శ్వేత రావు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు,  జిల్లా వ్యవసాయ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, పిఎసిఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, బుగులోని జాతర చైర్మన్ రొంటాల వెంకటస్వామి, తిరుమలగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్,నాయకులు కట్ల మధుసూదన్ రెడ్డి, గంగుల రమణారెడ్డి, పల్నాటి శ్రీను, పిఎసిఎస్ డైరెక్టర్ చల్లగురుగుల సుదర్శన్, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.