04-09-2025 06:16:26 PM
నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం రేబిస్(Rabies) వ్యాధిపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి, పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎస్. కిరణ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామాలలో తిరిగే కుక్కలు, పిచ్చి కుక్కలకు సంబంధించిన లక్షణాలను విద్యార్థులకు వివరించారు. కుక్కలు కరిచేందుకు వచ్చినప్పుడు వాటికి దొరకకుండా ఎలా తప్పించుకోవాలో సలహాలు ఇచ్చారు. రేబిస్ వ్యాధి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జే. వెంకటేశ్వరరావు, మండల విద్యాధికారి మేక నాగయ్య, మునిసిపల్ కమిషనర్ ఏ రంజిత్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.